Sakshi News home page

Indira Gandhi: ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం

Published Wed, Apr 17 2024 9:57 AM

1975 in Indira Gandhi imposed the Emergency - Sakshi

సొంత పార్టీయే బయటకు పొమ్మంది. అయినా, ఆమె తగ్గలేదు. ఉక్కు సంకల్పంతో పోరాడారు. ప్రజాక్షేత్రంలోనే బలం నిరూపించుకున్నారు. తిరుగులేని ఎత్తులతో ప్రతిపక్షాలతో పాటు స్వపక్షంలోని తస్మదీయులనూ చిత్తు చేశారు. లోక్‌సభను ఏడాది ముందే రద్దు చేసి ప్రజాతీర్పు కోరిన ఇందిరాగాంధీ అనుకున్నది సాధించారు. ఘర్షణకు దిగిన పాకిస్తాన్‌కు గట్టి బుద్ధి చెప్పడమే గాక పోఖ్రాన్‌ అణు పరీక్షతో మన శక్తిని ప్రపంచానికి చాటారు. కానీ దేశ ప్రజాస్వామ్య చరిత్రలోనే అత్యంత చీకటి కోణంగా చెప్పదగ్గ ఎమర్జెన్సీ విధింపు నిర్ణయంతో చెరగని మచ్చ మిగుల్చుకున్నారు. ఇలాంటి ఎన్నో విశేషాలకు 1971–77 ఐదో లోక్‌సభ కాలం సాక్షిగా నిలిచింది... 

సాక్షి, నేషనల్‌ డెస్క్‌: నాలుగో లోక్‌సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్‌లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిండికేట్‌ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దించారు. విప్‌ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్‌ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్‌సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్‌ (ఆర్‌) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. 

నాలుగో లోక్‌సభను ప్రధాని ఇందిర 1970 డిసెంబర్‌లో ఏడాది ముందే రద్దు చేయడం వెనుక గట్టి కారణాలే ఉన్నాయి. కాంగ్రెస్‌ అప్పటికే రెండుగా చీలింది. ఇందిర తీరు నచ్చని వ్యతిరేక వర్గం సిండికేట్‌గా ఏర్పడ్డారు. రాష్ట్రపతి ఎన్నిక ఇరు వర్గాల బలపరీక్షకు వేదికైంది. నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి పదవికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా సిండికేట్‌ ప్రకటించింది. తన విశ్వాసపాత్రుడే ఆ పదవిలో ఉండాలని ఇందిర భావించారు. ఉప రాష్ట్రపతి వి.వి.గిరిని స్వతంత్ర అభ్యరి్థగా బరిలో దించారు. విప్‌ జారీ చేయకున్నా, ఆత్మ ప్రబోధానుసారం ఓటేయాలంటూ పార్టీ నేతలకు పిలుపునిచ్చి అనుకున్నది సాధించారు. గిరిని గెలిపించుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి ఇందిర బహిష్కరణ తర్వాత 68 ఎంపీలు కాంగ్రెస్‌ (ఓ) వైపు నిలిచారు. దాంతో లోక్‌సభలో ఇందిర సారథ్యంలోని కాంగ్రెస్‌ (ఆర్‌) బలం 220 మంది ఎంపీలకు పడిపోయింది. డీఎంకే, అకాలీదళ్, లెఫ్ట్, స్వతంత్రుల మద్దతుతో ఆధికారాన్ని నిలబెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లారు ఇందిర. 

విపక్షాలు గుంపుగా వచ్చిన... 
ఇందిరను ఏకాకిని చేసేందుకు భారతీయ జనసంఘ్, స్వతంత్ర, సోషలిస్టు పార్టీలతో కాంగ్రెస్‌ (ఓ) చేతులు కలిపినా లాభం లేకపోయింది. 238 స్థానాల్లో పోటీ చేసి కాంగ్రెస్‌ (ఓ) గెలిచింది 16 మాత్రమే. బ్యాంకుల జాతీయీకరణ, రాజ భరణం రద్దు వంటి నిర్ణయాల ప్రాతిపదికన ప్రజామోదం కోరి ఇందిర ఘనవిజయం సాధించారు. అభ్యర్థులను కాకుండా తనను చూసి ఓటేయాలన్న ఆమె పిలుపు బాగా క్లిక్కయింది. అలాగే ‘గరీబీ హటావో, దేశ్‌ బచావో’ నినాదమూ సూపర్‌హిట్టయింది. ఇందిరా కాంగ్రెస్‌43.68 శాతం ఓట్లతో ఏకంగా 352 సీట్లు సొంతం చేసుకుంది. ప్రాంతీయ పారీ్టల ఎదుగుదలను మాత్రం ఇందిర అడ్డుకోలేకపోయారు. సీపీఎం 25, సీపీఎం 23, భారతీయ జనసంఘ్‌ 22 సీట్లు నెగ్గగా స్వతంత్ర పార్టీ 8 స్థానాలతో సరిపెట్టుకుంది. డీఎంకే 23 లోక్‌సభ స్థానాలతో బలమైన ప్రాంతీయ పారీ్టగా నిలదొక్కుకుంది.  

విశేషాలు... 
► ఐదో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ 1971 మార్చి 1 నుంచి 10 మధ్య కేవలం పది రోజుల్లోనే పూర్తయింది. 
► 1952 నుంచి లోక్‌సభ, దేశవ్యాప్తంగా అసెంబ్లీలకు జమిలిగా కొనసాగుతూ వస్తున్న ఎన్నికలకు ఇందిర ముందస్తు నిర్ణయంతో తొలిసారి తెర పడింది. 
► దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది. హరిత విప్లవ ఫలాలు అందివచ్చాయి. 
► 1971లో పాక్‌ మనపై యుద్ధానికి తెగబడింది. తూర్పు పాకిస్తాన్‌ ప్రజల స్వతంత్ర పోరాటానికి మద్దతుగా భారత బలగాలు బరిలో దిగి 13 రోజుల్లోనే పాక్‌ పీచమణిచాయి. పాక్‌ ► ఆర్మీ చీఫ్‌ జనరల్‌ నియాజీ ఏకంగా 93,000 మంది సైనికులతో లొంగిపోయారు. 
► డిసెంబర్‌ 16న బంగ్లాదేశ్‌ అవతరించింది. 
► 1974 మే 18న రాజస్తాన్‌లోని పోఖ్రాన్‌లో తొలి అణ్వస్త్ర పరీక్షలు విజయవంతంగా జరిగాయి. అమెరికా, సోవియట్‌ యూనియన్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా తర్వాత అణు సామర్థ్యమున్న దేశంగా భారత్‌ అవతరించింది.

చెరగని మరక... ఎమర్జెన్సీ 
1975 జూన్‌ 25. ఎమర్జెన్సీ విధిస్తూ ఇందిర నిర్ణయం తీసుకున్న రోజు. భారత ప్రజాస్వామ్య చరిత్రలోనే దుర్దినంగా మిగిలిపోయింది. ప్రజల సాధారణ హక్కులనూ కర్కశంగా కాలరాసిన ఈ కఠిన నిర్ణయానికి ఇందిర మొగ్గు చూపడానికి పలు కారణాలు చెబుతుంటారు. వాటిలో ముఖ్యమైంది మాత్రం 1971 లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి ఎంపీగా ఆమె గెలుపు చెల్లదంటూ అలహాబాద్‌ హైకోర్టు ఇచి్చన తీర్పే! అధికార యంత్రాంగాన్ని ఇందిర దుర్వినియోగం చేశారని, అనుమతించిన పరిమితికి మించి ఖర్చు చేశారని ఆమె చేతిలో ఓడిన రాజ్‌ నారాయణ్‌ కోర్టుకెక్కారు. ఇందిర ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారంటూ 1975 జూన్‌ 12న కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆమె ఎన్నికను రద్దు చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ సిన్హా ప్రకటించారు.

ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా, ఏ పదవినీ చేపట్టకుండా నిషేధం విధించారు. ఇందిర సుప్రీంకోర్టుకు వెళ్లగా కొన్ని షరతులతో హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ జూన్‌ 24న తీర్పు వెలువరించింది. మర్నాడే లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో లక్ష మందితో కూడిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీని ఉద్దేశించి ఉర్రూతలూగించే ప్రసంగం చేశారు. దాంతో అదే రోజు ఇందిర ఎమర్జెన్సీ విధించారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చినా వెనక్కు తగ్గలేదు. 1977 మార్చి 21 దాకా ఎమర్జెన్సీ అరాచకాలు కనీవినీ ఎరగని రీతిలో కొనసాగాయి. ఫలితంగా 1977 ఎన్నికల్లో ఇందిర ఘోర ఓటమి చవిచూడటంతో కేంద్రంలో తొలి కాంగ్రెసేతర సర్కారు గద్దెనెక్కింది. 


Advertisement
Advertisement