భారత్‌లో 76 లక్షలు దాటిన కరోనా కేసులు | Sakshi
Sakshi News home page

భారత్‌లో 76 లక్షలు దాటిన కరోనా కేసులు

Published Wed, Oct 21 2020 10:20 AM

54044 New Corona Cases Recorded In India - Sakshi

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య 76 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో 54,044 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 76,51,108కి చేరింది. నిన్న ఒక్క రోజే  717 మంది మరణించగా ఇప్పటివరకు మొత్తం 1,15,914 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. నిన్న 61,775 మంది కోలుకుని ఆసుపత్రులనుంచి డిశ్చార్జ్‌ అవ్వగా ఇప్పటి వరకు మొత్తం 67,95,103 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 7,40,090గా ఉంది. ( ఎడతెగని దగ్గు, శ్రీమతికి గోల్డెన్ చాన్స్ మిస్ )

కాగా, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,83,608 శాంపిళ్లను పరీక్షించామని, ఇప్పటివరకు 9,72,00,379 శాంపిళ్లను పరీక్షించామని ఐసీఎమ్‌ఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌) తెలిపింది.

Advertisement
Advertisement