బ్రీత్‌ అనలైజర్‌ టెస్టులో ఫెయిల్‌.. మహిళా పైలట్‌ సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

బ్రీత్‌ అనలైజర్‌ టెస్టులో ఫెయిల్‌.. మహిళా పైలట్‌ సస్పెన్షన్‌

Published Tue, Apr 9 2024 8:36 PM

Air India Woman Pilot Fails Breath Analyser Test - Sakshi

న్యూఢిల్లీ: ఎయిర్‌ ఇండియా మహిళా పైలట్‌ బ్రీత్ అనలైజర్‌ టెస్టులో ఫెయిలైంది. దీంతో టాటా గ్రూపు విమానయాన సంస్థ ఆ మహిళా పైలట్‌పై కఠిన చర్యలు తీసుకుంది. మూడు నెలల పాటు విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. గత వారం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లాల్సిన బోయింగ్‌ 787 విమానం ఫస్ట్‌ ఆఫీసర్‌గా మహిళా పైలట్‌ విధులు నిర్వహించాల్సి ఉంది.

ఇంతలో ఆమె బ్రీత్‌ అనలైజర్‌ టెస్టులో ఫెయిలై విధులకు దూరమైంది. ఈ విషయాన్ని ఎయిర్‌ ఇండియా అధికారులు మంగళవారం(ఏప్రిల్‌ 9) ధృవీకరించారు.  సస్పెన్షన్‌కు గురైన మహిళా పైలట్‌ సోషల్‌ మీడియాలో పాపులర్‌ అని తెలుస్తోంది. 

డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌(డీజీసీఏ) రూల్స్‌ ప్రకారం ఆల్కహాల్‌ తీసుకున్న పైలట్‌లను విమానం నడిపేందుకు అనుమతించరు.ఎవరైనా ఆల్కహాల్‌ ఉన్న మౌత్‌వాష్‌లు,టూత్‌ జెల్‌ మందులు తీసుకుంటే ముందుగా సమాచారమివ్వాల్సి ఉంటుంది. లేదంటే టెస్టుల్లో పట్టుబడితే తొలిసారి శిక్ష కింద విధుల నుంచి 3 నెలలు సస్పెండ్‌ చేస్తారు.  

ఇదీ చదవండి.. సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ,ఈడీ సోదాలు 

Advertisement
Advertisement