చిరంజీవి, రామ్‌ చరణ్‌లతో అమిత్‌ షా భేటీ 

18 Mar, 2023 01:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నటులు చిరంజీవి, రామ్‌ చరణ్‌లను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కలిశారు. అమెరికా నుంచి నేరుగా ఢిల్లీ వచ్చిన రామ్‌ చరణ్‌ శుక్రవారం ఢిల్లీలో జరిగిన ఓ హోటల్‌ లో జరిగిన మీడియా సంస్థ సదస్సులో పాల్గొన్నారు. అదే సదస్సులో కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం పాల్గొన్నారు.

సదస్సు అనంతరం అదే హోటల్‌లో బస చేస్తున్న రామ్‌ చరణ్‌ రూమ్‌ కి వెళ్లిన అమిత్‌ షా అక్కడ చిరంజీవి, చరణ్‌ లతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నందుకు గానూ అమిత్‌షా అభినందించి చరణ్‌ను శాలువాతో సత్కరించారు.

అనంతరం ట్వీట్‌ చేసిన కేంద్రమంత్రి అమిత్‌ షా భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్‌ చరణ్‌లను కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తెలుగు సినిమా పరిశ్రమ.. భారతదేశ సంస్కృతి, ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు