అవిభక్త కవలలు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు!!

23 Dec, 2021 19:48 IST|Sakshi

అన్ని అవయవాలు సక్రమంగా ఉండి కూడా సరిగా చదవకుండా ఏవో సాకులు చెబుతూ కాలక్షేపం చేయడం. సరైన ఉద్యోగం లేక నిరుద్యోగిగా కాలం వెళ్లదీసేవారు కొందరు. కానీ అమృతసర్‌ అవిభక్త కలలు తమ శారరీక లోపాన్ని అధిగమించి మరీ ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు.

(చదవండి: ఏకంగా పామునే హెయిర్‌ బ్యాండ్‌గా చుట్టుకుంది!! వైరల్‌ వీడియో)

అసలు విషయంలోకెళ్లితే...అమృత్‌సర్‌కి చెందిన అవిభక్త కవలలు  సోహ్నా, మోహనా న్యూ ఢిల్లీలో జూన్ 14, 2003న జన్మించారు. అయితే వీరికి రెండు హృదయాలు, చేతులు, మూత్రపిండాలు, వెన్నుపాములతో జన్మించారు. కానీ వీరికి ఒకటే  కాలేయం, పిత్తాశయం, కాళ్లు ఉన్నాయి. అయితే ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ వారిని పరీక్షించి శస్త్రచికిత్స వల్ల ప్రాణాంతకమైన సమస్యలు వచ్చే అవకాశం ఉన్నందున వేరు చేయకూడదని నిర్ణయించారు.

దీనికి తోడు పుట్టిన వెంటనే తల్లిదండ్రుల నిరాధరణకు గురయ్యారు. ఈ మేరకు పిగల్వార్‌ సంస్థ చదువు చెప్పించడమే కాక వీరి బాగోగులను చూసుకుంది. అంతేకాదు వారు తమ శారీరక లోపాన్ని అధిగమించి కష్టపడి చదువుకోవడమే కాక పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (పీఎస్‌పీసీఎల్‌)లో ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించుకున్నారు. పైగా వారికి ఆ రంగంలో అనుభవం ఉన్నందున వారిని నియమించకున్నట్లు పీఎస్‌పీసీఎల్‌ సబ్‌స్టేషన్ జూనియర్ ఇంజనీర్ రవీందర్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఆ అవిభక్త కవలలు మాట్లాడుతూ...తమకు ఈ ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం. పైగా మాకు ఈ అవకాశం ఇచ్చిన పంజాబ్‌ ప్రభుత్వానికి తమ విద్యనందించిన పింగల్వార్‌ సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం" అని అన్నారు.

(చదవండి: హై పవర్‌ ట్రాన్స్‌మిషన్ తీగపై వేలాడుతూ.. స్వీట్లు, మొబైల్‌ కావాలంటూ..)

మరిన్ని వార్తలు