అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు | Ashok Gehlot Son Raided By ED In Forex Violation Case, See Details Inside - Sakshi
Sakshi News home page

Forex Violation Case: అశోక్ గహ్లోత్ కుమారుని ఆస్తులపై ఈడీ సోదాలు

Published Wed, Jan 3 2024 1:26 PM

Ashok Gehlot Son Raided By ED In Forex Violation Case - Sakshi

జైపూర్: ఫారెక్స్ ఉల్లంఘన కేసులో కాంగ్రెస్ నేత అశోక్ గహ్లోత్ కుమారుడు వైభవ్ గహ్లోత్‌ ఆస్తులపై ఈడీ నేడు సోదాలు నిర్వహిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన హాస్పిటాలిటీ గ్రూప్ ట్రిటాన్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, వర్ధ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం శివ శంకర్ శర్మ, రతన్ కాంత్ శర్మలపై నమోదైన కేసు విచారణలో భాగంగా వైభవ్‌పై కూడా ఈడీ చర్య తీసుకుంది.  రతన్ కాంత్ శర్మ కార్ రెంటల్ సర్వీస్‌లో వైభవ్ గెహ్లాట్ వ్యాపార భాగస్వామిగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం.

వైభవ్ గెహ్లాట్ మారిషస్‌కు చెందిన 'శివ్నార్ హోల్డింగ్స్' అనే షెల్ కంపెనీ నుంచి అక్రమ నిధులను ముంబయికి చెందిన ట్రిటాన్ హోటల్స్‌కు మళ్లించారని రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. హోటల్‌కు చెందిన 2,500 షేర్లను కొనుగోలు చేసి నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఒక్కో షేరు అసలు ధర రూ. 100 ఉండగా, రూ.39,900కు కొనుగోలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ కేసుకు సంబంధించి గత ఏడాది అక్టోబర్‌లో ఈడీ ముందు వైభవ్ హాజరయ్యారు. జైపూర్, ఉదయ్‌పూర్, ముంబయి, ఢిల్లీలోని ప్రదేశాలలో గతేడాది ఆగస్టులో మూడు రోజుల పాటు ట్రైటన్ హోటల్స్ దాని ప్రమోటర్లపై ఈడీ సోదాలు జరిపింది. ఈ సోదాల తర్వాత లెక్కల్లో చూపని రూ.1.2 కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు. 

ఇదీ చదవండి: మూడోసారి ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా

Advertisement
Advertisement