ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. బైక్‌పై నుంచి ఎగిరిపడి బస్సు వెనుక టైర్‌ కింద..

21 Jul, 2022 14:04 IST|Sakshi


రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్‌ ధరించి.. ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని చెబుతూనే ఉంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని వారిని జరిమానాలు సైతం విధిస్తుంటారు.

తాజాగా హెల్మెట్‌ ధరించడం ఎంత ముఖ్యమో కర్నాటక పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ఈ వీడియోలో ఓ బైకర్‌ స్పీడ్‌గా ‍డ్రైవ్‌ చేస్తూ ఓ బస్సు బ్యాక్‌ టైర్‌ కిందపడిపోతాడు. అయితే, ఈ సమయంలో బైకర్‌ ఐఎస్‌ఐ స్టాండర్డ్‌ మార్క్‌ ఉన్న హెల్మెట్‌ను ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో, ప్రతీ ఒక్కరూ విధిగా స్టాండర్ట్‌ ఉన్న హెల్మెట్‌ను ధరించి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించాలని సూచించారు. 

మరిన్ని వార్తలు