Land-For-Jobs Case: Bihar Dy CM Tejashwi Yadav Appears Before ED - Sakshi
Sakshi News home page

Tejashwi Yadav: ఈడీ ఎదుట విచారణకు హాజరైన తేజస్వీ యాదవ్..

Published Tue, Apr 11 2023 2:23 PM

Bihar Dy CM Tejashwi Yadav Appears Before ED Job For Land Scam - Sakshi

న్యూఢిల్లీ: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. జాబ్‌ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆయనను అధికారులు ప్రశ్నించారు. ఊదయం 10:45 గంటల సమయంలో తేజస్వీ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది.

ఈ కేసుకు సంబంధించి సీబీఐ కూడా తేజస్విని గత నెలలోనే ప్రశ్నించింది. తనను అరెస్టు చేయబోమని సీబీఐ ఢిల్లీ కోర్టుకు చెప్పడంతో ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంకు సంబంధించి లాలూ కుటుంబసభ్యులను కూడా ఈడీ విచారించింది. మార్చి 25న తేజస్వీ సోదరి, ఎంపీ మిసా భారతిని కూడా ప్రశ్నించింది. 

లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు కొందరి వద్ద భూములు తీసుకొని రైల్వే శాఖలో ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. దీన్నే జాబ్ ఫర్ ల్యాండ్ స్కాంగా పిలుస్తున్నారు. ఈ స్కాం ద్వారా పొందిన ఆస్తుల విలువ ఇప్పుడు రూ.600 కోట్లకుపైనే ఉందని ఈడీ చెబుతోంది. మరోవైపు తేజస్వీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు.
చదవండి: సుప్రీంకోర్టులో సీఎం స్టాలిన్‌కు షాక్.. తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ ర్యాలీకి లైన్ క్లియర్..

Advertisement
Advertisement