యమునా ఎక్స్‌ప్రెస్‌ వే పై ప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం

12 Feb, 2024 10:53 IST|Sakshi

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ మధుర పరిధిలోని మహవాన్‌ వద్ద యమునా ఎక్స్‌ప్రెస్‌ వేపై సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. 40 మందితో ప్రయాణిస్తున్న బస్సు కారును ఢీకొన్న ఘటనలో అయిదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది.

బస్సు బీహార్‌ నుంచి ఢిల్లీ వైపు వెళుతోంది. ఈ ప్రమాదం కారణంగా చెలరేగిన మంటల్లో కారు పూర్తిగా కాలిపోయి అందులోని వ్యక్తులు సజీవ దహనమైనట్లు సమాచారం. బస్సులో ఉన్నవారంతా ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలిసింది. 

ఇదీ చదవండి.. పారా గ్లైడింగ్‌ చేస్తూ హైదరాబాద్‌ టూరిస్టు మృతి 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega