ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం | Sakshi
Sakshi News home page

ఉల్లి ఎగుమతులపై కేంద్రం నిషేధం

Published Sat, Dec 9 2023 6:14 AM

Centre bans onion export till March 2024 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశీయంగా ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి ఎగుమతులపై నిషేధం విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం ఉల్లి ధర కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది.

ధరల కట్టడి చర్యల్లో భాగంగా ఈనెల 8 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ వరకు ఎగుమతులపై నిషేధం విధిస్తూ డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (డీజీఎఫ్‌టీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దేశీయంగా ఉల్లి సరఫరాను మెరుగుపరిచేందుకు, ధరలను అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అందులో పేర్కొంది.

Advertisement
Advertisement