New Covid-19 Rules: కరోనాపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు.. వాళ్లకు ఆర్టీపీసీఆర్ తప్పనిసరి.. ఆక్సిజన్ సిలిండర్లపై ఆరా..

24 Dec, 2022 14:08 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త వేరియంట్ బీఎఫ్‌.7 వెలుగుచూసిన తరుణంలో కేంద్రం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్‌సుఖ్ మాండవీయ శనివారం ఉదయం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు. అనంతరం కొత్త మార్గదర్శకాలను ప్రకటించారు.

ఇకపై విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్‌టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేశారు. అయితే చైనా, దక్షిణకొరియా, జపాన్, హాంకాంగ్, థాయ్‌లాండ్ నుంచి వచ్చే ప్యాసెంజర్లకే ఇది వర్తిస్తుంది. పరీక్షల్లో వీరిలో ఎవరికైనా పాజిటివ్ వస్తే క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తారు.

ఆక్సిజన్‌పై ఆరా..
అలాగే దేశంలో ఆక్సిజన్ సిలిండర్ల లభ్యతపైనా కేంద్రం ఆరా తీసింది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సిలిండర్ల విషయంపై ప్రతివారం సమీక్ష నిర్వహించాలని రాష్ట్రాలకు లేఖలు రాసింది. హాస్పిటల్స్‌లో లిక్విడ్ ఆక్సిజన్ అందుబాటులో ఉంచాలని సూచించింది. ఆక్సిజన్ కంట్రోల్ రూమ్స్ మళ్లీ ఏర్పాటు చేయాలని చెప్పింది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు సరిగా పనిచేస్తున్నాయా లేదో మాక్ డ్రిల్ నిర్వహించాలంది. ఆక్సిజన్ డిమాండ్ సరఫరా వినియోగంపై ప్రత్యేక యాప్ నిర్వహించాలని లేఖలో పేర్కొంది.
చదవండి: హోమియోపతి మందులతో లిక్కర్.. కల్తీమద్యం ఘటనలో షాకింగ్ నిజాలు..

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు