Chandrayaan-3: రోవర్‌కు తప్పిన ప్రమాదం | Chandrayaan-3: Rover Pragyan Successfully Bypassed That Hole On Lunar Surface With Special Instructions - Sakshi
Sakshi News home page

Chandrayaan-3: రోవర్‌కు తప్పిన ప్రమాదం

Published Tue, Aug 29 2023 5:21 AM

Chandrayaan-3: Rover Pragyan successfully bypassed that hole - Sakshi

సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రుడిపై పరిశోధనలకు పంపిన రోవర్‌కు చంద్రుడిపై పెద్ద ప్రమాదం తప్పింది. ల్యాండర్‌ నుంచి విడుదలైన రోవర్‌ చంద్రుడిపై తిరుగుతూ పలు రకాల పరిశోధనలు చేస్తూ భూనియంత్రిత కేంద్రాలకు సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంది.

రోవర్‌ ప్రయాణిస్తున్న మార్గంలో సుమారు నాలుగు మీటర్లు వెడల్పయిన బిలాన్ని గుర్తించింది. అయితే, బిలాన్ని మూడుమీటర్ల దూరంలో ఉండగానే రోవర్‌ గుర్తించిందని ఇస్రో తెలిపింది. ప్రమాదవశాత్తూ ఆ బిలంలో పడి ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని పేర్కొంది. ప్రత్యేక ఆదేశాలతో మరో దారిని రోవర్‌ ఎంచుకుందని వివరించింది. ప్రస్తుతం రోవర్‌ సురక్షితమైన మార్గంలో ముందుకు సాగుతోందని ఇస్రో సోమవారం ఎక్స్‌(ట్విట్టర్‌)లో పేర్కొంది.  
రోవర్‌ తప్పించుకున్న బిలం ఇదే..                      దారిమళ్లిన రోవర్‌ గుర్తులు

Advertisement

తప్పక చదవండి

Advertisement