‘పాంచ్‌ న్యాయ్‌-పచ్చీస్‌ గ్యారంటీస్‌’ కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల | Sakshi
Sakshi News home page

‘పాంచ్‌ న్యాయ్‌-పచ్చీస్‌ గ్యారంటీస్‌’: కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదల అప్‌డేట్స్‌

Published Fri, Apr 5 2024 8:43 AM

Congress Party Election Manifesto Release At AICC Office - Sakshi

Live Updates..

‘పాంచ్‌ న్యాయ్‌-పచ్చీస్‌ ‍గ్యారంటీస్‌’ పేరుతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదలైంది. 48 పేజీలతో మేనిఫెస్టోను విడుదల చేశారు. 

మేనిఫెస్టోలో సామాజిక సంక్షేమ పథకాలతో 25 గ్యారంటీలు.

 పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గిస్తామని. రైల్వేల ప్రైవేటీకరణను నిలిపివేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు.

అలాగే, బీజేపీ ప్రభుత్వం తెచ్చిన అగ్నివీర్‌ను రద్దు చేస్తామన్నారు. ఎలక్టోరల్‌ బాండ్స్‌ మీద విచారణ. పెగాసెస్‌,రాఫెల్‌పై విచారణ. 

అనంతరం, మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. కిసాన్‌ న్యాయ్‌ పేరుతో రైతులను ఆదుకుంటాం. దేశవ్యాప్తంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందిస్తాము. పేద మహిలకు ఏడాదికి రూ.లక్ష ఇస్తాము. కనీస మద్దతు ధర చట్టం తీసుకోస్తామని చెప్పారు. 

కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు గ్యారంటీలు

1. యువతకు జాబ్ గ్యారంటీ, ఏడాదికి లక్ష జీతం
2. ప్రతీ మహిళకు ఏడాదికి లక్ష రూపాయల సాయం
3. కులగణన
4. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దినసరి వేతనం నాలుగు వందలకు పెంపు
5. స్వామి నాథన్ సిఫారసుల మేరకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత.

మేనిఫెస్టోలో ముఖ్యాంశాలు

హిస్సేదారి న్యాయ్:
1. సామాజిక, ఆర్థిక కుల గణన 
2. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ల కల్పనపై 50% సీలింగ్ తొలగింపు 
3. ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ కోసం స్పెషల్ బడ్జెట్ 
4. జల్ జంగల్ జమీన్పై చట్టబద్ధహక్కులు
5. గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్డ్ ఏరియాలో గుర్తింపు

కిసాన్ న్యాయ్ : 
1. స్వామినాథన్ ఫార్ములా ప్రకారం పంటలకు గిట్టుబాటు ధర చట్టబద్ధత
2. రుణమాఫీ కమిషన్ ఏర్పాటు
3. పంట నష్టపోయిన 30 రోజుల్లో బీమా పరిహారం చెల్లింపు గ్యారెంటీ
4. రైతులు లబ్ధి పొందేలా ఎగుమతి దిగుమతి విధానం
5. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు

శ్రామిక్ న్యాయ్ :
1. రైట్ టు హెల్త్ చట్టం
2. రోజుకు 400 రూపాయల కనీస వేతనం- ఉపాధి హామీ పథకంలో సైతం 
3. పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం అమలు
4. అసంఘటిత రంగ కార్మికులకు జీవిత బీమా, యాక్సిడెంట్ బీమా
5. ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాల నియామకాలు నిలుపుదల 

యువ న్యాయ్:
1. కేంద్రాన్ని ప్రభుత్వంలో 30 లక్షల ఉద్యోగాల భర్తీ
2. యువతకు ఏడాది అప్రెంటిస్ట్ షిప్ - ఏడాదికి లక్ష రూపాయలు నెలకు రూ.8500 చెల్లింపు 
3. పేపర్ లీక్ అరికట్టేందుకు కఠినమైన చట్టం
4. గిగ్ వర్కర్ల సామాజిక భద్రతకు చర్యలు 
5. యువత స్టార్టప్  కోసం ఐదు వేల కోట్ల నిధి కేటాయింపు 

నారీ న్యాయ్‌: 
1. ప్రతీ పేద కుటుంబంలోని ఒక మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు
3. ఆశ, అంగన్వాడీ మిడ్ డే మీల్ వర్కర్స్కు డబుల్ శాలరీ కాంట్రిబ్యూషన్ 
4. మహిళల హక్కుల రక్షణ కోసం అధికారి మైత్రి ఏర్పాటు 
5. వర్కింగ్ విమెన్ కోసం సావిత్రిబాయి పూలే పేరుతో రెట్టింపు హాస్టల్స్

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, చిదంబరం, ఇతర కాంగ్రెస్‌ నేతలు మేనిఫెస్టును విడుదల చేశారు. 

ఇక, శనివారం రాజస్థాన్‌లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్‌ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జై‌పూర్‌లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్‌‌లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్‌ గాంధీ మేనిఫెస్టోను లాంచ్‌ చేసి ప్రసంగించనున్నారు. 

Advertisement
Advertisement