హింసాత్మకంగా మారిన నిరసనలు.. రాజధానిలో కర్ఫ్యూ విధింపు

10 Jun, 2022 19:37 IST|Sakshi

మహ్మద్‌ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపుర్‌ శర్మ, నవీన్‌ జిందాల్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప‍్తంగా ముస్లిం సంఘాలు నిరసనలకు దిగాయి. పలు రాష్ట్రాల్లో శుక్రవారం మసీద్‌లో నమాజ్‌ ముగిసిన వెంటనే నిరసనకారులు ఆందోళనలకు దిగారు. 

కాగా, ముస్లింల ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటుచేసుకున్నాయి. జార్ఖండ్‌లో నిరసనకారులు.. పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో, పోలీసులు వారిపై టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ క్రమంలో పోలీసులతో పాటు నిరసనకారులు కూడా గాయపడ్డారు. దీంతో రాంచీలో కర్ఫ్యూ విధించారు. ప్రజలందరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ఈ నేపథ్యంలో జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌ మీడియాతో మాట్లాడుతూ.. నిరసనల గురించి సమాచారం అందింది. జార్ఖండ్‌ ప్రజలు ఎప్పుడూ చాలా సహనంతో ప్రశాంతంగా ఉంటారు. ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రతీ ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని తెలిపారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌లో కూడా హింసాత్మక ఘటనలు జరిగాయి. నిరసనకారులు వాహనాలకు నిప్పంటించారు. అనంతరం పోలీసులపైకి రాళ్లు విసిరారు. దీంతో పోలీసులు నిరసనకారులపైకి టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. 

ఇది కూడా చదవండి: టెన్షన్‌.. టెన్షన్‌.. పాతబస్తీలో మోహరించిన పోలీసులు.. వీడియో

మరిన్ని వార్తలు