బిపర్‌జోయ్‌  తుపాను మహోగ్రరూపం | Sakshi
Sakshi News home page

బిపర్‌జోయ్‌  తుపాను మహోగ్రరూపం

Published Sun, Jun 11 2023 7:16 PM

Cyclone Biparjoy Intensified Into An Extremely Severe Cyclonic Storm - Sakshi

బిపర్‌జోయ్‌ తుపాను ఉగ్రరూపం దాల్చింది. ఇది మరో 10 గంటల్లో అత్యంత తీవ్ర తుపానుగా మారే అవకాశం కనబడుతోంది. దీని ప్రభావంతో గుజరాత్‌ తీర ప్రాంతలో భారీగా ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గుజరాత్‌పై పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదని ఇప్పటికే ఐఎండీ స్పష్టం చేసిననప్పటికీ సౌరాష్ట్ర, కచ్‌ దగ్గర తీరాన్ని తాకే అవకాశం ఉండటంతో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల్లో దీని ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. బిపర్‌జోయ్‌ తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్య్సకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.

మరొకవైపు ఈ తుపాను ప్రభావంతో రానున్న ఐదు రోజులపాలు గుజరాత్‌లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. కర్ణాటక, గోవా రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉంది.   వాతావవరణ శాఖ సైక్లోన్‌ అలర్ట్‌ జారీ చేయడంతో గుజరాత్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిలో భాగంగా గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అత్యంత తీవ్ర తుపానుగా మారే దృష్ట్యా అధికారులు అంతా సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజ్‌కుమార్‌, డీజీపీ వికాస్‌ సహాయ్‌, రిలీఫ్‌ కమిషనర్‌ అలోక్‌ పాండే, రెవెన్యూ శాఖ, ఇంధన శాఖ, రోడ్డు భవనాల శాఖల ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  ఇదిలా ఉంచితే, రాబోయే ఐదు రోజుల్లో గుజరాత్‌లోని కచ్‌, పాకిస్తాన్‌లోని కరాచీలపై ఈ తుపాను ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది.
- ఉదయ్‌ కుమార్‌, సాక్షి వెబ్‌డెస్క్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement