తెలుగు రాష్ట్రాలను వణికించిన గులాబ్‌ తుపాన్‌ పాకిస్తాన్‌ వైపు | Sakshi
Sakshi News home page

Cyclone Gulab పాకిస్తాన్‌ వైపుగా వెళ్తున్న గులాబ్‌ తుపాన్‌

Published Wed, Sep 29 2021 5:28 PM

Cyclone Gulab Storm Move Towards Pakistan On Thursday - Sakshi

న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్‌ తుపాన్‌ ప్రస్తుతం ఆరేబియా సముద్రంలో కేంద్రీకృతమై తుపాన్‌గా మారి సెప్టెంబర్‌ 30న పాకిస్తాన్‌ వైపుగా దూసుకోస్తోందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈ గులాబ్‌ తుపాన్‌ కళింగపట్నం- గోపాలపూర్‌ మధ్య తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా భారత్‌లో కొన్నిప్రాంతాల్లో అక్కడక్కడ కొనసాగుతోంది. ఈ అల్పపీడనం గుజరాత్‌ దిశగా రావడంతో గుజరాత్‌లోనూ పక్కనే ఉన్నఖంభాట్‌ గల్ఫ్‌లోనూ  ఒక మోస్తారుగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 

(చదవండి: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, ముగ్గురు పిల్లలతో సహా..)

ఈ క్రమంలో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ, ఈశాన్య అరేబియా సముద్రంలోకి ఉద్భవించి, గురువారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత అది పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి 24 గంటల్లో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఈ మేరకు పశ్చిమ తీరం నుంచి పశ్చిమ వాయువ్య దిశలో ఉన్న పాకిస్తాన్ మక్రాన్ తీరాలకు వెళ్లే అవకాశం ఉందని పేర్కొంది. అయితే భారత తీరం నుంచి మాత్రం దూరంగా వెళుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ గులాబ్‌ తుపాన్‌ ప్రభావంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడిన సంగతి తెలిసిందే.

(చదవండి: విమాన సేవలను తిరిగి పునరుద్ధరించండి’)

Advertisement

తప్పక చదవండి

Advertisement