ఢిల్లి లిక్కర్‌ కేసులో కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు | Sakshi
Sakshi News home page

ఢిల్లి లిక్కర్‌ కేసులో కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

Published Tue, May 14 2024 2:25 PM

Delhi court extends judicial custody of K Kavitha till May 20

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను రౌస్‌ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. ఆమె కస్టడీని ఆరు రోజులపాటు(మే 20) వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.

లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఆమె కస్టడీ మంగళవారంతో ముగియడంతో నేడు రౌస్‌ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా హాజరుపరిచారు. 14 రోజుల పాటు కవిత జ్యుడీషియల్ కస్టడి పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, చార్జ్ షీట్ ఫైల్ చేసినట్లుగా కోర్టుకు తెలిపింది.

8 వేల పేజీలతో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేశామని ఈడీ చెప్పింది. దీనిపై స్పందించిన కోర్టు మే 20న ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే అంశంపై విచారిస్తామని తెలిపింది. ఈ క్రమంలో కవిత జ్యుడీషియల్‌ కస్టడీని ఈనెల 20 వరకు పొడిగిస్తున్నట్లు స్పెషల్‌ కోర్టు జడ్జి వెల్లడించారు. కాగా సీబీఐ కేసులోనూ గతంలో కవితకు మే 20 వరకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆమె ప్రస్తుతం తిహార్‌ జైల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఈ కేసులో కవిత పాత్రను ప్రస్తావిస్తూ ఇటీవల ఈడీ చార్జిషీట్‌ దాఖలు చేసింది. మరోవైపు ఈడీ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24న విచారణ చేపట్టనుంది.  

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

Advertisement
 
Advertisement
 
Advertisement