టీకా సర్టిఫికేట్లతో షో చేయోద్దు - కేంద్రం | Sakshi
Sakshi News home page

టీకా సర్టిఫికేట్లతో షో చేయోద్దు - కేంద్రం

Published Wed, May 26 2021 3:53 PM

 Do Not Post Your COVID 19 Vaccination Certificate On Social Media - Sakshi

న్యూఢిల్లీ: కొవిడ్‌ టీకా తీసుకున్నట్టుగా ప్రభుత్వం జారీ చేసే సర్టిఫికేట్లు సోషల్‌ మీడియాలో షేర్‌ చేయోద్దంటూ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోషల్‌ మీడియాలో వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్లు అప్‌లోడ్‌ చేయడం, షేర్‌ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కుతుందంటూ కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్లకు చిక్కితే ప్రమాదంలో పడేందుకు ఆస్కారం ఉందంటూ కేంద్రం సూచించింది. కేంద్ర హోంశాఖ నిర్వహిస్తున్న సైబర్‌​ దోస్త్‌ ట్విట్టర్‌ పేజీలో ఈ వివరాలు ఉంచింది.

సైబర్‌ సేఫ్‌
వ్యాక్సిన్‌ తీసుకున్నవారికి ధృవీకరణ పత్రాలను కోవిన్‌ యాప్‌ ద్వారా కేంద్రం జారీ చేస్తోంది. ఇందులో పేరు, వయస్సు తదితర వ్యక్తిగత వివరాలు ఉంటున్నాయి. విదేశీ ప్రయాణాలు చేసేప్పుడు  వ్యాక్సినేటెడ్‌ సర్టిఫికేట్లు తప్పనిసరి చేశాయి పలు దేశాలు. దీంతో ఇటీవల వ్యాక్సినేషన్‌ సర్టిఫికేట్ల ట్రెండ్‌ నడుస్తోంది. చాలా మంది తాము వ్యాక్సిన్‌ తీసుకున్నామంటూ సోషల్‌ మీడియాలో ఫోటోలు పోస్ట్‌ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం పలు సూచనలు చేసింది. 
 

Advertisement
Advertisement