అగ్ని ప్రైమ్‌ పరీక్ష విజయవంతం

19 Dec, 2021 05:19 IST|Sakshi

బాలాసోర్‌: అగ్ని ప్రైమ్‌(అగ్ని– పి) క్షిపణిని భారత్‌ విజయవంతంగా పరీక్షించింది. అణ్వాయుధాలు మోసుకవెళ్లే సామర్ధ్యమున్న ఈ బలాస్టిక్‌ మిసైల్‌ను ఒడిషా తీరంలోని అబ్దుల్‌కలామ్‌ ద్వీపం నుంచి శనివారం దిగ్విజయంగా పయ్రోగించినట్లు డీఆర్‌డీఓ తెలిపింది. ఇందులో పలు అత్యాధునిక ఫీచర్లు పొందుపరిచామని తెలిపింది. 1000– 2000 కిలోమీటర్ల రేంజ్‌ ఉన్న ఈ క్షిపణిని ఉపరితలం నుంచి ప్రయోగిస్తారు.

పరీక్షలో క్షిపణి కచ్ఛితమైన లక్ష్యసాధన చేసిందని డీఆర్‌డీఓ వెల్లడించింది. ఈ సందర్భంగా సైంటిస్టుల బృందాన్ని రక్షణమంత్రి రాజ్‌నాధ్‌ ప్రశంసించారు. అగ్ని– పి పరీక్ష విజయవంతం కావడంపై డీఆర్‌డీఓ చైర్మన్‌ సతీశ్‌రెడ్డి హర్షం ప్రకటించారు. తొలిసారి ఈ క్షిపణిని జూన్‌ 28న పరీక్షించారు.  నేడు జరిపిన రెండో పరీక్షతో క్షిపణి పూర్తి స్థాయి అభివృద్ధి సాధించిందని, వీలయినంత త్వరలో దీన్ని సైన్యంలో ప్రవేశపెట్టే ఏర్పాట్లు చేస్తున్నామని డీఆర్‌డీఓ తెలిపింది.

మరిన్ని వార్తలు