‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్‌లో 105 ఏళ్ల వృద్ధుని రోదన! | Sakshi
Sakshi News home page

‘నన్ను కొట్టి చంపేస్తున్నాడు’.. కమిషనరేట్‌లో 105 ఏళ్ల వృద్ధుని రోదన!

Published Sun, Aug 13 2023 8:09 AM

Elderly man Reached Police Commissioner Office - Sakshi

యూపీలోని కాన్పూర్‌లో 105 ఏళ్ల వృద్ధుడు నేరుగా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి చేరుకుని, తన గోడు వెళ్లబోసుకున్నాడు. కార్యాలయానికి వచ్చిన ఆ వృద్ధుడిని చూసిన ఏడీసీపీ అశోక్‌ కుమార్‌ ముందుగా ఆతనికి చల్లని నీరు అందించారు. తరువాత అతని బాధేమిటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అనంతరం స్థానిక పోలీసులకు ఫోన్‌ చేసి, ఆ వృద్దుని తరపున ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. 

వివరాల్లోకి వెళితే కాన్పూర్‌కు చెందిన రాజ్‌ బహదూర్‌ అనే వృద్ధుని గోడు పోలీసులు పట్టించుకోకపోవడంతో.. చేతికర్ర సాయంతో అతను నేరుగా పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చాడు. అతనిని చూసిన పోలీస్‌ కమిషనర్‌  స్టాఫ్‌ ఆఫీసర్‌(ఏడీసీపీ) అశోక్‌ కుమార్‌ అతని దగ్గరకు వచ్చి వివరాలు తెలుసుకున్నారు. తనను గ్రామానికి చెందిన ఉత్తమ్‌ కుమార్‌ అనే యువకుడు వేధిస్తున్నాడని, కొడుతున్నాడని ఆ వృద్దుడు ఫిర్యాదు చేశాడు. తాను ఆంగ్లేయుల పరిపాలనా కాలాన్ని చూశానని, అప్పట్లో తన వయసు 12 ఏళ్లు ఉంటుందని తెలిపాడు. వృద్దుని గోడు విన్న ఏడీసీపీ ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి, సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
ఇది కూడా చదవండి: అన్నల మద్యం అలవాటుకు చెల్లెలు బలి.. సూసైడ్‌ నోట్‌లో మరో యువకుని పేరు? 
 

Advertisement
Advertisement