Delhi: రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు | Farmers Protest Marching To Parliament Stopped By Police On The Noida And Delhi Chilla Border - Sakshi
Sakshi News home page

Delhi Farmers Protest: రైతుల భారీ నిరసన.. అడ్డుకున్న పోలీసులు

Published Thu, Feb 8 2024 4:04 PM

Farmers protest march to Parliament Stopped In Noida - Sakshi

ఢిల్లీ: వందలాది మంది రైతులు నిరసన తెలుపుతూ.. పార్లమెంట్‌ వరకు చేపట్టిన ర్యాలీని నోయిడాలోని మహామాయ ఫ్లైఓవర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు పెట్టిన బారికేడ్స్‌ను దాటడానికి రైతులు ప్రయత్నించారు. దీంతో అక్కడ ఉద్రిత్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దానికి సంబంధించన వీడియో వైరల్‌ మారింది. నోయిడా ట్రాఫిక్‌ పోలీసులు ఈ రూట్‌లో నిరసన ర్యాలీ చేట్టవద్దని  ముందుగా  సమాచారం అందించినా రైతులు పెద్ద ఎత్తున  ర్యాలీ తీశారు. దీంతో అక్కడ అధికంగా ట్రాఫిక్‌ జామ్‌ చోటుచేసుకుంది. 

అయితే నోయిడాలోని పలు గ్రామాల రైతుల తాము పార్లమెంట్ బయట తమ డిమాండ్ల కోసం నిరసన తెలుపుతామని ప్రకటించారు. తాము ట్రాక్టర్లు, బస్సులతో రాజాధాని ఢిల్లీకి నిరసనగా ప్రవేశిస్తామని తెలిపారు.  వారంతా మహామాయ ఫ్లైఓవర్‌ వద్దకు చేరుకొని ఢిల్లీవైపు బయలుదేరుదామని నిర్ణయించుకున్నారు. కాగా.. ఒక్కసారిగా వందలది మంది రైతులు  తమ వాహనాలతో గుమిగూడటంతో ట్రాఫిక్‌ అంతరాయంతో పాటు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.  దీంతో పోలీసులు రైతులను ర్యాలీ ముందుకు వెళ్లకుండా బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు.

నివాస అవసరాల కోసం సేకరించిన మొత్తం భూమిలో 10 శాతం, 64.7 శాతం పెంచిన భూ పరిహారం, రెసిడెన్షియల్ ప్లాట్‌లపై వాణిజ్య కార్యకలాపాలకు అనుమతి, ఇతర ప్రయోజనాల కోసం తమ డిమాండ్లను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించడం లేదని భారతీయ కిసాన్ ఏక్తా సంఘ్ నాయకుడు సుఖ్‌బీర్ యాదవ్ మండిపడ్డారు. తమ డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో రైతులమంతా పార్లమెం‍ట్‌ వద్దకు నిరసన ర్యాలీ చేపట్టామని ఆయన పేర్కొన్నారు. 

చదవండి: Delhi: కూలిన మెట్రో స్టేషన్‌ వాల్‌... పలువురికి గాయాలు!

Advertisement
Advertisement