పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని.. | Sakshi
Sakshi News home page

పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని..

Published Sun, Jun 25 2023 9:06 AM

Fear of 34 Dogs an Elderly Couple Sell their House - Sakshi

యూపీలోని లక్నోలో శునకాల వీరంగంతో జనం ఏ స్థాయిలో భయపడుతున్నారంటే చివరికి ఇంటిని కూడా అమ్మేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. లక్నోలోని జానకీపురంలో ఉంటున్న ఒక వృద్ధ జంట ఎదురింటిలోని కుక్కలకు భయపడి తమ ఇంటిని విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. 

ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే లక్నోలోని జానకీపురం ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట ఇటీవలే స్థానికంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అయితే వారు ఈ ఇంటిలోకి అడుగుపెట్టగానే వారికి కుక్కల బెడద మొదలయ్యింది. దీంతో వారు తాము ఉంటున్న ఇంటిని వెంటనే అమ్మివేయాలని భావిస్తూ, ఇంటి బయటి గేటుకు ‘ఇల్లు అమ్మబడును’ అనే బోర్డు తగిలించారు. 

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారు ఏకంగా 34కు మించిన కుక్కలను పెంచుతున్నారని,ఈ కుక్కలు రోజుంతా ఈ ప్రాంతంలో తిరుగుతూ అందరినీ వెంబడిస్తున్నాయని, చిన్నారులను భయపెడుతున్నాయని,​ ‍కరుస్తున్నాయని తెలిపారు. వీటికి భయపడే ఆ వృద్ధ దంపతులు తమ ఇంటిని విక్రయించాలనుకుంటున్నారని అన్నారు.

స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఆ కుక్కల యజమానికి నోటీసు అందించారు. కాగా లక్నోలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక పిట్‌బుల్‌ డాగ్‌ తన యజమానిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఇదేవిధంగా రిటైర్డ్‌ టీచర్‌ సుశీల్‌(82) కూడా శునకాల దాడిలో కన్నుమూశారు.  

ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో..

Advertisement
Advertisement