Bengaluru: పర్‌ఫ్యూమ్‌ ఫ్యాక్టరీ గోదాంలో అగ్నిప్రమాదం | Sakshi
Sakshi News home page

పర్‌ఫ్యూమ్‌ ఫ్యాక్టరీ గోదాంలో అగ్నిప్రమాదం.. ముగ్గురి మృతి

Published Mon, Feb 19 2024 1:54 PM

Fire Accident In Bengaluru Perfume Factory Godown Three Dead - Sakshi

బెంగళూరు: కర్ణాటక రాజధాని నగరం బెంగళూరు శివార్లలోని  ఓ పర్‌ఫ్యూమ్‌ ఫ్యాక్టరీ గోదాంలో ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ వారిలో 10 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న బాలురు కూడా ఉండటంతో గోదాంలో చిన్న పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బెంగళూరు శివార్లలోని మైసూర్‌ రోడ్డు సమీపంలో నివాసాల మధ్య ఏర్పాటు చేసిన ఈ గోదాంనకు లైసెన్స్‌ ఉందా లేదా అన్నదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గడువు దాటిపోయిన పర్‌ఫ్యూమ్‌ బాటిళ్లను డీల్‌ చేసేందుకు ఈ గోదాంను రెండు వారాలే క్రితమే ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి.. బైక్‌పై వెళుతున్న యువకునికి గుండెపోటు  

Advertisement
 
Advertisement
 
Advertisement