అసెంబ్లీ ఎన్నికలు 2022: ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ.. | Sakshi
Sakshi News home page

అసెంబ్లీ ఎన్నికలు 2022: ఆ రాష్ట్రాల్లో ఆంక్షలు షురూ..

Published Sat, Jan 8 2022 6:00 PM

Five State Election: Election Code Came Into Force From 8th Jan - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. ఏడు విడతల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ జనవరి 8న ప్రకటించింది. దీంతో ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా రాష్ట్రాల్లో తక్షణమే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చింది. జనవరి 15వరకు రోడ్‌ షోలపై నిషేదం విధించారు. రాజకీయ పార్టీలు ఎలాంటి ర్యాలీలు నిర్వహించకూడదు. పాదయాత్రలు, సైకిల్‌, బైక్‌ ర్యాలీలపై కూడా నిషేదం విధించారు.

ఐదు రాష్ట్రాలకు ఎన్నికల పరిశీలకులుగా 900 మంది అబ్జర్వర్లను నియమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల అభ్యర్థులు రూ.40లక్షలు ఎన్నికల వ్యయం చేసేందుకు అవకాశమిచ్చారు. గోవా, మణిపూర్‌ రాష్ట్రాలలో ఇదే అభ్యర్థి వ్యయాన్ని రూ.28లక్షలుగా నిర్ణయించారు. కాగా, ఈ ఎన్నికల ప్రక్రియ జనవరి 14న మొదలై.. మార్చి 10న ఐదు రాష్ట్రాల ఫలితాలతో ముగియనుంది. 

చదవండి: (ఏడు విడతల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. నోటిఫికేషన్‌ విడుదల)

Advertisement
Advertisement