గూగుల్ డ్యుయో సేవలు నిలిపివేత!

26 Jan, 2021 14:36 IST|Sakshi

ప్రస్తుతం వీడియో కాలింగ్‌ కోసం అందుబాటులో ఉన్న ఆండ్రాయిడ్ యాప్స్‌లో గూగుల్ డ్యుయో యాప్ ఒకటి. ఇందులో ఒకేసారి 32 మందితో వీడియో కాల్ చేసి‌ మాట్లాడుకొనే సౌకర్యం ఉంటుంది. తాజాగా గూగుల్ డ్యుయో సేవలు కొన్ని మొబైల్ ఫోన్ లలో నిలిచిపోనున్నట్లు తెలుస్తుంది. గూగుల్ చేత ధృవీకరణ చేయబడని కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఈ యాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ప్లే సర్వీసెస్‌ కోసం గూగుల్‌ ఆండ్రాయిడ్‌ డివైజ్‌లకు పరీక్షలు నిర్వహించి సర్టిఫై చేస్తుంది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం సర్టిఫైడ్ చేసిన ఫోన్లు సురక్షితమైనవి, గూగుల్ ప్లే స్టోర్లో ఉండే యాప్ లు ఎటువంటి ఆటంకం లేకుండా ఇందులో పని చేస్తాయి.(చదవండి: వాట్సాప్ పై కేంద్రం ఆగ్రహం)

ఒకవేళ గనుక గూగుల్ యాప్స్‌కు సంబంధించిన సర్టిఫికేట్ గూగుల్ ఇవ్వకుంటే వాటిలో ఈ యాప్స్‌ పనిచేయవు. గతంలో ఇలాగే కొన్ని మొబైల్ ఫోన్లలో గూగుల్ మెస్సేజెస్‌ సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు అదే తరహాలో త్వరలో గూగుల్ డ్యుయో సేవలు నిలిచపోనున్నాయి. గూగుల్ డ్యుయో సేవలు హువావే బ్రాండ్ల స్మార్ట్‌ఫోన్‌లలో నిలిచిపోనున్నట్లు సమాచారం. మిగతా నోకియా, శాంసంగ్, వన్‌ప్లస్‌, వివో, ఒప్పోతో పాటు ఇతర బ్రాండ్లలో ఈ యాప్‌ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదని తెలుస్తోంది. ఈ సేవలు మార్చి 31 నుంచి నిలిచిపోనున్నట్లు సమాచారం.  

డేటా భద్రపర్చుకొండి
మీరు డ్యుయో యాప్‌ ఓపెన్ చేసిన వెంటనే ‘త్వరలో డ్యుయో ఆగిపోనుంది. ఎందుకంటే మీరు గూగుల్ ధృవీకరించని డివైజ్‌ ఉపయోగిస్తున్నారు. మీ ఖాతాను ఈ డివైజ్‌ నుంచి తొలగించడం జరుగుతుంది’ అనే మెస్సేజ్ పని చేయని ఫోన్లలో వస్తుంది. ఒకవేళ కనుక ఈ మెసేజ్ వస్తే వెంటనే మీరు మీ పూర్తీ డేటాను సేవ్ చేసుకొని వేరొక చోట భద్రపర్చుకోవడం మంచిది. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌, జూమ్‌, జియోమీట్‌, స్నాప్‌ఛాట్ వంటి వాటిని వాడుకోవచ్చు.  
 

మరిన్ని వార్తలు