Haryana Announced Monthly Pension For Unmarried Men And Women - Sakshi
Sakshi News home page

పెళ్లి కాని వారికి గుడ్‌న్యూస్‌.. పెన్ష‌న్ అందించనున్న ప్రభుత్వం

Published Thu, Jul 6 2023 5:59 PM

Haryana Announced Monthly Pension For Unmarried Men And Women - Sakshi

చండీఘ‌డ్‌: హర్యానా ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెళ్లి కాని యువతీ యువకుల కోసం ప్రత్యేక పెన్షన్‌ స్కీమ్‌ను ప్లాన్‌ చేసింది. హర్యానాలో వివాహం చేసుకోని వారికి ప్రతీ నెలా రూ.2,750లను పెన్షన్‌గా ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. 

వివరాల ప్రకారం.. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ గురువారం కీలక ప్రకటన చేశారు. హర్యానాలో పెళ్లి కాని ఆడ‌వాళ్ల‌కు, మ‌గవాళ్ల‌కు ప్ర‌తి నెలా రూ.2,750 ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే, ఈ స్కీమ్‌ 45 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు ఉన్న వారికి మాత్రమే వర్తించనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. అవివాహిత పెన్ష‌న్ అందుకునేవారి వార్షిక ఆదాయం రూ.1.80 ల‌క్ష‌ల‌కు త‌క్కువ‌గా ఉండాల‌ని ప్రభుత్వం రూల్‌ పెట్టింది. 

మరోవైపు.. హర్యానాలో వితంతవులను కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వితంతువుల‌కు కూడా పెన్ష‌న్‌ను అందించనున్నట్టు సీఎం ఖట్టర్‌ ప్ర‌క‌టించారు. 40 నుంచి 60 ఏళ్ల మ‌ధ్య ఉన్న వితంతువుల‌కు ప్ర‌తినెలా రూ.2750 ఇవ్వ‌నున్నట్టు తెలిపారు. అయితే వాళ్ల వార్షిక ఆదాయం 3 ల‌క్ష‌ల లోపు ఉండాలనే నిబంధనను విధించారు. 

ఇది కూడా చదవండి: మద్రాస్‌ హైకోర్టు కీలక తీర్పు.. ఎంపీ ఎన్నిక రద్దు..

Advertisement
Advertisement