శ్రీశారదా పీఠాన్ని సందర్శించిన హరియాణా సీఎం

18 Apr, 2022 14:31 IST|Sakshi
పీఠాధిపతి స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకుంటున్న హరియాణా సీఎం ఖట్టర్‌

సాక్షి, విశాఖపట్నం(పెందుర్తి): విశాఖ శ్రీశారదా పీఠాన్ని హరియాణా సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆదివారం సందర్శించి రాజశ్యామల అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందారు. స్వామీజీ చేతుల మీదుగా శంకరాచార్య విగ్రహాన్ని అందుకున్నారు. ధర్మ పరిరక్షణ కోసం పీఠం చేస్తోన్న కృషిని సీఎంకు స్వరూపానందేంద్ర వివరించారు.

ప్రభుత్వం స్థలం కేటాయిస్తే హరియాణాలో కూడా శ్రీశారదాపీఠం ఆశ్రమం ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఖట్టర్‌ మాట్లాడుతూ..రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం హరియాణా ప్రజలపై ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. అంతకుముందు సీఎంకు పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వాగతం పలికారు. కాగా, ఆదివారం సాయంత్రం సింహాచలంలోని వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ఖట్టర్‌ సందర్శించారు. 

చదవండి: (AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌ల వేతనాలు పెంపు)

మరిన్ని వార్తలు