హిజాబ్‌ వ్యవహారం: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం

13 Feb, 2022 11:52 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: హిజాబ్‌ ఆందోళనల నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఉడిపి జిల్లాలో 144 సెక్షన్‌ విధించినట్లు పేర్కొంది. రేపు(సోమవారం) నుంచి ఈ నెల 19 వరకు ఉడిపిలో 144 సెక్షన్‌ అమలు కానుంది. ఇప్పటికే ప్రభుత్వం  విద్యాసంస్థల సెలవులను ఈ నెల16 వరకు పొడగించిన విషయం తెలిసిందే.

ఉడిపి డిప్యూటీ కమిషనర్ కూర్మారావు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల వద్ద 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ ప్రకారం నిషేధాజ్ఞలు కొనసాగుతాయని తెలిపారు. 

మరిన్ని వార్తలు