Historic Sceptre, 'Sengol', To Be Placed In New Parliament Building - Sakshi
Sakshi News home page

రాజదండం సాక్షిగా... పార్లమెంటులో చోళుల సెంగోల్‌

Published Wed, May 24 2023 2:24 PM

Historic Sceptre Sengol To Be Placed In New Parliament Building - Sakshi

పార్లమెంట్‌ నూతన భవనాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెల 28న ఆదివారం లాంఛనంగా ‍ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆభవనంలో స్పీకర్‌ సీటు వద్ద ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రక రాజందండాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వెల్లడించారు. దీన్ని నాటి బ్రిటీషర్లు నుంచి బారతీయులకు అధికార మార్పిడి జరిగిందనేందుకు గుర్తుగా ఈ రాజదండాన్ని మన దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూకి అందజేసినట్లు అమిత్‌ షా తెలిపారు. ఈ రాజదండాన్ని 'సెంగోల్‌' అని పిలుస్తారు. ఇది తమిళ పదం సెమ్మై నుంచి వచ్చింది. దీని అర్థం ధర్మం.

రాజదండం నేపథ్యం..
బ్రిటిష్‌ ఇండియా చివరి వైస్రాయ్‌ లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు అధికార మార్పిడికి గుర్తుగా మన మధ్య ఏదోకటి విలువైనది ఉండాలని నాటి తొలి ప్రధాని నెహ్రుని అడిగారు. అప్పడు ఆయన సలహ కోసం నాటి గవర్నర్‌ రాజాజీగా పిలిచే సీ రాజగోపాలాచారిని ఆశ్రయించారు. ఆయన ఈ 'సెంగోల్‌ని' సూచించారు. చోళుల పాలనలోని సంప్రదాయాన్ని అనుసరించి 'సెంగోల్‌' అనే రాజదండాన్ని సూచించారు. ఇది భారతదేశానికి స్వేచ్ఛ లభించిందని సూచించగలదని, పైగా అధికార మార్పిడికి చిహ్నంగా ఉండగలదని నెహ్రుతో రాజాజి చెప్పారు. దీంతో ఈ రాజదండాన్ని ఏర్పాటు చేసే బాధ్యత రాజాజీపై పడింది. 

రాజదండాన్ని ఎలా రూపొందించారు
ఈ రాజదండాన్ని ఏర్పాటు కష్టతర బాధ్యతను తీసుకున్న రాజాజీ తమిళనాడులోని ప్రముఖ మఠమైన తిరువడుతురై అథీనంను సంప్రదించారు. ఆ మఠం దీన్ని రూపొందించే బాధ్యతను స్వీకరించింది. అప్పటి మద్రాసులో నగల వ్యాపారి వుమ్మిడి బంగారు చెట్టి ఈ సెంగోల్‌ను తయారు చేశాడు. ఇది ఐదుడుగుల పొడువు ఉండి, పైన న్యాయానికి ప్రతిక అయిన నంది, ఎద్దు ఉంటాయి. 

అప్పగించిన విధానం
సదరు మఠంలోని పూజారి రాజదండాన్ని మౌంట్‌ బాటన్‌కి అప్పగించి తిరిగి తీసుకున్నారు. ఆ తర్వాత భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అర్థరాత్రి 15 నిమిషాల ముందు గంగాజలంతో అభిషేకించి, ప్రధానమంత్రి నెహ్రు వద్దకు ఊరేగింపుగా వెళ్లి ఆయనకు అప్పగించారు(అధికార మార్పిడి జరిగనట్లుగా). ప్రధాని నెహ్రు ప్రత్యేక గీతంతో ఆ రాజందండాన్ని అందుకున్నారు. 

కొత్త పార్లమెంట్‌లో సెంగోల్‌ స్థానం
ఈ సెంగోల్ చరిత్ర  ప్రాముఖ్యత  గురించి చాలా మందికి తెలియదని హోం మంత్రి అన్నారు. కొత్త పార్లమెంట్‌లో దీనిని ఏర్పాటు చేయడం వల్ల మన సంస్కృతి సంప్రదాయాలను నేటి ఆధునికతకు జోడించే ప్రయత్నం చేశారన్నారు. కొత్త పార్లమెంట్‌లో 'సెంగోల్‌'ను ఏర్పాటు చేయాలనే ప్రణాళిక కూడా ప్రధాని మోదీ దూరదృష్టిని ప్రతిబింబిస్తోందని షా అన్నారు.

'సెంగోల్' ఇప్పుడు అలహాబాద్‌లోని మ్యూజియంలో ఉంది. ఇప్పుడు దాన్ని కొత్త పార్లమెంటుకి తీసుకురానున్నట్లు అమిత్‌ షా చెప్పుకొచ్చారు. అలాగే దయచేసి దీన్ని రాజకీయాలకు ముడిపెట్టోదని నొక్కి చెప్పారు. తాము చట్టబద్ధంగా పరిపాలన సాగించాలని కోరుకుంటున్నామని, ఆ చారిత్రక రాజదండం ఎల్లప్పుడూ మాకు దీనిని గుర్తు చేస్తుందని అమిత్‌ షా చెప్పుకొచ్చారు. మరిచిపోయిన చరిత్రను గుర్తు చేసే ప్రయత్నంలో భాగంగా ఈ చారిత్రత్మక రాజదండంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 

(చదవండి: పార్లమెంట్‌ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించనున్న విపక్షాలు!)

Advertisement
Advertisement