ట్రెండింగ్‌లో ‘కుక్క’.. ఆ జంటను ఆడేసుకుంటున్నారు.. ఫన్‌ ఫన్‌ మోర్‌ ఫన్‌..!

27 May, 2022 12:54 IST|Sakshi

పెంపుడు కుక్కను ఈవినింగ్‌ వాక్‌ కోసం స్టేడియంలోకి తీసుకెళ్లడం, ఆ ఐఏఎస్‌ జంట కోసం నిర్వాహకులు అథ్లెట్లను ఖాళీ చేయించడం.. నిన్నంతా ఈ వ్యవహారం దేశ రాజధానిలో హీట్‌ పుట్టించింది. విమర్శల నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం రంగంలోకి దిగగా..  ఆ జంటపై ఆఘమేఘాల మీద ‘బదిలీ’ చర్యలు తీసుకుంది కేంద్ర హోం శాఖ. 

అయితే ఈ జంట వ్యవహారం ఇప్పుడు ట్విటర్‌లో కొత్త ట్రెండ్‌కు దారి తీసింది. ఈ ఉదయం నుంచి #Kutta హ్యాష్‌ట్యాగ్‌ విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. ఐఏఎస్‌ జంట అయిన సంజీవ్‌ ఖీరావర్‌, రింకూ దుగ్గను చెరో ప్రాంతానికి బదలీ చేసింది కేంద్ర హోం వ్యవహారాల శాఖ. ఖీరావర్‌ను లడఖ్‌, దుగ్గాను అరుణాచల్‌ ప్రదేశ్‌ను బదిలీ చేస్తూ..  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డందుకుగానూ  శిక్ష విధించింది. 

ఈ తరుణంలో.. నెట్‌లో కుక్క మీమ్స్‌ నవ్వులు పూస్తున్నాయి. పూల్‌ ఔర్‌ కాంటే సినిమాలోని అజయ్‌ దేవగణ్‌ ఫేమస్‌ స్టంట్‌ను ఈ జంటపై ప్రయోగించాడు ఓ నెటిజన్‌. అక్కడి నుంచి మొదలైన.. కుక్క ట్రెండ్‌ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

ఇద్దరూ చెరోవైపు వెళ్లారని, పాపం ఆ కుక్క ఎక్కడికి వెళ్తుందని ఫన్‌ పుట్టిస్తున్నారు కొందరు. ఇదిలా ఉంటే.. త్యాగరాజ్‌ స్టేడియంలో ఈ జంట కోసం అథ్లెట్లను వెళ్లగొట్టిన ఘటనపై ఢిల్లీ సీఎస్‌ దగ్గరి నుంచి నివేదిక తెప్పించుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.   ఆపైనే బదిలీ చర్యలు తీసుకుంది.

సంబంధిత వార్త: స్టేడియంలో అధికారి కుక్క వాకింగ్ కోసం.. 

మరిన్ని వార్తలు