ఎలక్షన్ ఎఫెక్ట్.. ఉల్లి ఎగుమతులకు మళ్ళీ బ్రేక్ | India Extends Ban On Onion Exports Ahead Of General Elections, Details Inside - Sakshi
Sakshi News home page

ఎలక్షన్ ఎఫెక్ట్.. ఉల్లి ఎగుమతులకు మళ్ళీ బ్రేక్

Published Sat, Mar 23 2024 7:15 PM

India Extends Ban On Onion Exports - Sakshi

2023 డిసెంబ‌ర్‌లో కేంద్రం ఉల్లి ఎగుమతులను 2024 మార్చి 31వరకు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన వేళ 'ఉల్లి' ఎగుమతులపై కేంద్రం నిషేధాన్ని మరింత  పొడిగించింది. తదుపరి నోటీసు వచ్చే వరకు నిషేధం కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎగుమతి ఆంక్షలు అమలులోకి వచ్చినప్పటి నుంచి స్థానిక ధరలు సగానికి పైగా తగ్గాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం మీద వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త పంట చేతికి వచ్చినా ఎగుమతులు నిషేదించడం సమంజసం కాదని వెల్లడించారు. 

అతిపెద్ద ఉల్లి ఉత్పత్తి రాష్ట్రమైన మహారాష్ట్రలోని కొన్ని హోల్‌సేల్ మార్కెట్‌లలో 100 కేజీల ఉల్లి ధరలు 2023 డిసెంబర్‌లో రూ.4,500 వద్ద ఉండేవి. నేడు ఆ ధరలు 1200 రూపాయలకు పడిపోయాయని వ్యాపార సంఘాలు పేర్కొన్నాయి. 

బంగ్లాదేశ్, మలేషియా, నేపాల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఉల్లి కోసం భారతదేశంపై ఆధారపడి ఉన్నాయి. భారత్ ఉల్లి ఎగుమతులను నిషేధించడం వల్ల ఆ దేశాల్లో ఉల్లి ధరలు భారీగా పెరిగిపోయాయి. ఆసియా దేశాల మొత్తం ఉల్లిపాయల దిగుమతుల్లో సగానికి పైగా వాటా భారతదేశానిదే కావడం గమనార్హం. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇండియా 2.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేసినట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement