India Indispensable Partner To Achieve Free And Open Indo-Pacific: Japanese Foreign Minister - Sakshi
Sakshi News home page

స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌కు భారత్‌ కీలకం

Published Sat, Jul 29 2023 5:49 AM

India Indispensable Partner To Achieve Free says Japanese Foreign Minister Yoshimasa Hayashi - Sakshi

న్యూఢిల్లీ: స్వేచ్ఛాయుత ఇండో–పసిఫిక్‌ సాధనలో భారత్‌ అనివార్య భాగస్వా మి అని జపాన్‌ విదేశాంగ మంత్రి యోషిమస హయా షి పేర్కొన్నారు. భారత్‌తో అన్ని రంగాల్లో ప్రత్యేక వ్యూహాత్మక, అంతర్జాతీయ భాగస్వామ్యం బలోపేతం చేసుకునేందుకు జపాన్‌ ఆసక్తితో ఉందన్నారు. గ్లోబల్‌ సౌత్‌పై దృష్టిసారించిన భారత్‌ను హయాషి ప్రశంసించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు సరైన శ్రద్ధ చూపకుంటే స్వేచ్ఛాయుత, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమత ఒట్టి నినాదంగానే మారిపోతుందన్నారు.

భారత్‌కు రెండు రోజుల పర్యటనకు వచ్చిన హయాషి శుక్రవారం విదేశాంగ ఏర్పాటు చేసిన భారత్‌–జపాన్‌ ఫోరం సమావేశంలో మాట్లాడారు. సైబర్, అంతరిక్ష రంగాల్లో రెండు దేశాల మధ్య జరుగుతున్న చర్చల్లో పురోగతి సాధించామన్నారు. రక్షణ ఉత్పత్తులు, సాంకేతిక అంశాలకు సంబంధించిన చర్చల్లో సహకారంపై చర్చలు సాగుతున్నాయని వివరించారు. ఈ చర్చలో భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ మాట్లాడుతూ..భారత్‌కు జపాన్‌ సహజ భాగస్వామిగా పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement