India records 3,016 new Covid-19 cases, up 40% than previous day - Sakshi
Sakshi News home page

భారత్‌లో కరోనా టెన్షన్‌.. ఒక్కరోజులో 40శాతం కేసులు జంప్‌!

Published Thu, Mar 30 2023 12:03 PM

India Records 3016 New Covid Virus Cases - Sakshi

ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ మళ్లీ టెన్షన్‌కు గురిచేస్తోంది. వైరస్‌ వ్యాప్తి కారణంగా భారత్‌లో పాజిటివ్‌ కేసుల సంఖ్య ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఒక్కరోజులోనే 40 శాతం పాజిటివ్‌ కేసులు పెరగడంతో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం దేశంలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3వేలు దాటింది. 

వివరాల ప్రకారం.. దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3016 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్టు కేంద్ర వైదారోగ్య శాఖ తెలిపింది. అంతకుముందు రోజుతో పోలిస్తే ఇది ఏకంగా 40 శాతం ఎక్కువ అని స్పష్టం చేసింది. బుధవారం దేశవ్యాప్తంగా మొత్తం 1,10,522 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి. మంగళవారం రోజువారీ కేసుల సంఖ్య 2,151గా ఉండగా.. ఒక్కరోజులోనే వెయ్యికిపైగా కేసులు పెరిగాయి. మరోవైపు, దేశంలో వైరస్‌ కారణంగా నిన్న ఒక్కరోజు 14 మరణాలు చోటుచేసుకున్నాయి. కేరళలో 8, మహారాష్ట్రలో 3, ఢిల్లీలో 2, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకరు మృతిచెందారు. తాజా మరణాలలో దేశంలో ఇప్పటి వరకు వైరస్‌ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,30,862కి చేరింది. 

ఇక, దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,509గా ఉంది. ఇక రకవరీ రేటు 98.78 శాతంగా ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.7 శాతంగా కొనసాగుతోంది. మరోవైపు, దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కోరలు చాస్తోంది. బుధవారం ఢిల్లీలో 300 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది 3వేలకుపైగా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన 3375 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మళ్లీ ఆరు నెలల తర్వాత నేడు.. కేసుల సంఖ్య 3వేల మార్క్‌ దాటింది. 

Advertisement
Advertisement