రైల్వే ప్రయాణికుల టికెట్ తనిఖీ కోసం కొత్త యాప్ | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికుల టికెట్ తనిఖీ కోసం కొత్త యాప్

Published Fri, Jul 24 2020 7:39 PM

Indian Railways Starts New Ticket Checking System At Mumbai Station - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ మానవుని జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిందనడంలో సందేహం లేదు. అలానే సరికొత్త టెక్నాలజీలను కూడా మానవాళికి పరిచయం చేస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ కోరలు చాస్తున్న నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికుల టికెట్ల తనిఖీ కోసం 'చెక్‌ఇన్‌ మాస్టర్'‌ పేరుతో ఓ యాప్‌ను తీసుకొచ్చింది. 

ఈ యాప్‌ను ఉపయోగించి ప్రయాణికుల వద్దనున్న టికెట్‌ను తాకకుండా టికెట్‌ కండక్టర్‌లు వారి మొబైల్‌ ఫోన్‌లతో బార్‌ కోడ్‌, క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి తనిఖీ చేస్తారు. ఈ విధానాన్ని తొలుత ప్రయోగాత్మకంగా ముంబైలోని ఛత్రపతి శివాజి మహారాజ్‌ టెర్మినల్‌ స్టేషన్‌లో ప్రారంభించారు. కాగా.. టికెట్ల తనిఖీ సమయంలో రైల్వే సిబ్బందికి కరోనా సోకకుండా ఉండేందుకే ఈ యాప్‌ను ప్రవేశపెట్టినట్లు ముంబై రైల్వేశాఖ వర్గాలు వెల్లడించాయి. (2023లో మొదటి దశ ప్రైవేట్‌ రైళ్లు)

Advertisement

తప్పక చదవండి

Advertisement