టీవీ నటి దారుణ హత్య.. 24 గంటల్లోనే ఉగ్రవాదులను మట్టుబెట్టారు

27 May, 2022 08:58 IST|Sakshi

శ్రీనగర్‌: టీవీ ఆర్టిస్ట్‌ అమ్రీన్‌ భట్‌ హత్య కేసును.. 24 గంటల్లో సాల్వ్‌ చేశారు పోలీసులు. నటిని హత్య చేసిన ఉగ్రవాదుల్ని ఎట్టకేలకు ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారు. 

జమ్ము కశ్మీర్‌ టీవీ నటి అమ్రీన్‌ భట్‌ Amreen Bhatను బుద్గం జిల్లాలో కాల్చి చంపారు టెర్రరిస్టులు. అయితే వాళ్లను ట్రాప్‌ చేసిన జమ్ము పోలీసులు.. పుల్వామా జిల్లా అవంతిపోరా అగన్‌హంజిపోరా దగ్గర గురువారం రాత్రి ఎన్‌కౌంటర్‌లో మట్టుపెట్టారు. 

చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులు లష్కర్‌ ఈ తాయిబా గ్రూప్‌ సభ్యులుగా నిర్ధారించారు. ఎల్‌ఈటీ కమాండర్‌ లతీఫ్‌ ఆదేశాలతోనే వీళ్లిద్దరూ టీవీ నటిని పొట్టనబెట్టుకున్నట్లు కశ్మీర్‌ ఐజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు. 

ఇదిలా ఉంటే.. శ్రీనగర్‌ సౌరా ఏరియాలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో.. ఇంకో ఇద్దరు ఉగ్రవాదుల్ని పోలీసులు ఏరిపారేశారు. గత మూడు రోజుల్లో కశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లలో పది మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

మరిన్ని వార్తలు