Jharkhand: సీఎం సోరేన్‌కు ఈడీ లాస్ట్‌ చాన్స్‌.. ఆయన సోదరి ఫైర్‌ | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌ సీఎంకు ఏడోసారి ఈడీ నోటీసులు.. ఆయన సోదరి ఫైర్‌

Published Sun, Jan 7 2024 1:40 PM

Jharkhand Cm Hemant Soren Sister Anger On Ed Notices To His Brother - Sakshi

భువనేశ్వర్‌: జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌కు వరుసగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌( ఈడీ) నోటీసులు పంపడంపై ఆయన సోదరి అంజలి సోరేన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు ఎస్టీ అయినందునే కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు. ఆదివారం ఈ విషయమై భువనేశ్వర్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

‘ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసి ట్రైబల్స్‌ను బాగు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఓ వైపు మాట్లాడుతోంది. మరో వైపు ట్రైబల్స్‌ అయిన మమ్మల్ని వేధిస్తున్నారు. నా సోదరుని ప్రభుత్వం ట్రైబల్ ప్రభుత్వం. జార్ఖండ్‌లో ఈ ప్రభుత్వం కొనసాగితే ట్రైబల్‌ ఓట్లు తమకు రావని బీజేపీ భయపడుతున్నట్లుంది.

ఇందుకే నా సోదురుడికి చెడ్డపేరు వచ్చేలా బీజేపీ ప్రయత్నిస్తోంది. ట్రైబల్‌ వర్గానికి చెందిన ఆయనను వేధిస్తున్నారు’అని అంజలి అన్నారు. మీ సోదరుడికి ఈడీ సమన్లు ఎందుకు పంపిదో తెలుసా అని మీడియా అడగ్గా ఆ విషయం తనకు తెలియదని, కేంద్రం మాత్రం తన సోదరుడిని వేధిస్తోందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఈడీ హేమంత్‌ సోరేన్‌ను అరెస్ట్‌ చేస్తే సోరేన్‌ భార్య సీఎం అవుతారా అని ప్రశ్నించగా అది పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని సమాధానమిచ్చారు.

కాగా, ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీలాండరింగ్‌ చట్టం​ కింద ఈడీ సోరేన్‌కు ఇప్పటికే ఆరు సార్లు సమన్లు పంపింది. అయితే ఆరుసార్లు ఆయన ఈడీ ముందు హాజరు కాలేదు. దీంతో ఈడీ తాజాగా ఆయనకు ఏడోసారి సమన్లు పంపింది. ఇది మీకు చివరి అవకాశం. మీ స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాలి. ప్లేస్‌, టైమ్‌ మీరే చెప్పండి. మీరు రాకపోవడం వల్ల విచారణకు అడ్డంకులు ఎదురవుతున్నాయి’ అని నోటీసుల్లో ఈడీ సోరేన్‌కు తెలపడం గమనార్హం. 

ఇదీచదవండి..ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్సు సరికొత్త రికార్డు     

Advertisement
Advertisement