తృటిలో తప్పిన రైలు ప్రమాదం | Sakshi
Sakshi News home page

Rajasthan: తృటిలో తప్పిన రైలు ప్రమాదం

Published Sat, Jan 6 2024 6:42 AM

Jodhpur Bhopal Passenger Train Coaches Derailed - Sakshi

రాజస్థాన్‌లోని కోటా రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జోధ్‌పూర్-భోపాల్ పాసింజర్ రైలు పట్టాలు తప్పింది. కోటా రైల్వే స్టేషన్‌లోని నాల్గవ నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. 

ఈ ఆకస్మిక ఘటనతో ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. దీంతో పలువురు ప్రయాణికులు కంపార్ట్‌మెంట్‌లో నుంచి దూకేశారు. వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ రైలు శుక్రవారం ఉదయం 10 గంటలకు జోధ్‌పూర్‌లో బయలుదేరి భోపాల్‌కు వెళ్తోంది. కోటా వద్దకు రాగానే ఈ ప్రమాదం జరిగింది. 

రైలులోని రెండు కోచ్‌లు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటన అనంతరం రైల్వే బృందం ప్రయాణికులను రైలు నుంచి బయటకు తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

ఈ ఘటన అనంతరం ట్రాక్‌పై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పలు రైళ్లను ఇతర రైల్వే ట్రాక్‌లపైకి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం రైల్వే ట్రాక్ పునరుద్ధరణ జరిగింది.  అయితే ఈ లైనులో రైళ్లు మూడు గంటలు ఆలస్యంగా నడుస్తున్నాయి. 
 

Advertisement
Advertisement