రైతుల నిరసనలకు కేజ్రీవాల్‌ మద్దతు | Sakshi
Sakshi News home page

రైతుల నిరసనలకు కేజ్రీవాల్‌ మద్దతు

Published Thu, Nov 26 2020 2:10 PM

Kejriwal Against Central Government Bills And Support Farmers - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేస్తున్న సందర్భంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ ట్వీట్‌ చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేకమే. ఈ బిల్లులను వెనక్కి తీసుకోకుండా రైతులను శాంతియుత నిరసనలు చేయకుండా ఆపుతున్నారు. వాటికి వ్యతిరేకంగా నీటి ఫిరంగులను ఉపయోగిస్తున్నారు. ఇలా రైతులకు అన్యాయం చేస్తున్నారు. శాంతియుత నిరసన చేయడం వారి రాజ్యాంగ హక్కు, ”అని కేజ్రీవాల్ గురువారం ట్వీట్‌లో పేర్కొన్నారు.

లోక్‌సభ, రాజ్యసభల్లో కేంద్ర ప్రభుత్వ బిల్లులకు వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఓటు వేసింది. వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసే చట్టాలకు నిరసనగా వేలాది మంది రైతులు పంజాబ్, హర్యానా నుంచి ఢిల్లీ వరక కవాతులు నిర్వహిస్తున్నారు. హర్యానాలో కొంత మందిని ఆపేయడానికి నీటి ఫిరంగులను ఉపయోగించారు. మరికొంత మంది ధైర్యంగా ఢిల్లీని ఆశ్రయించాలని వారి ప్రయత్నాన్ని మానుకోలేదు. కానీ ఢిల్లీ పోలీసులు కోవిడ్‌ 19 నిబంధనలకు కట్టుబడి సమావేశాలకు వ్యతిరేకంగా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా మెట్రో సౌకర్యాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేశారు.

Advertisement
Advertisement