Sakshi News home page

Largest District: దేశంలో అతిపెద్ద జిల్లా ఏది?

Published Wed, Sep 6 2023 9:56 AM

Largest District of India there was Once a State - Sakshi

భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాల్లో రాష్ట్రపతి సారధ్యంలో పరిపాలన కొనసాగుతుంది. రాజ్యాంగంలో జిల్లాలను నిర్ణయించే వ్యవస్థ కూడా ఉంది. కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాల్లో అవసరాన్ని అనుసరించి జిల్లాలు ఏర్పడతాయి. రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే జిల్లాల సంఖ్యను పెంచుతుంది. అంటే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంది. అయితే భారతదేశంలో అతిపెద్ద జిల్లా గురించి మీకు తెలుసా? నాటి రోజుల్లో ఆ జిల్లా పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఆ ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ జిల్లాలో సగభాగం ఎడారి
భారతదేశంలోని అతిపెద్ద జిల్లా పేరు కచ్. ఇది గుజరాత్‌లో ఉంది. విస్తీర్ణం పరంగా ఇది అతిపెద్ద జిల్లాగా పేరొందింది. గుజరాత్‌లోని ఈ జిల్లా మొత్తం వైశాల్యం 45,674 చదరపు కిలోమీటర్లు. ఇది రాష్ట్రంలోని 23.7 శాతం భూభాగంలో విస్తరించివుంది. ఈ జిల్లాలోని సగానికి పైగా ప్రాంతం ఎడారితో నిండి ఉంది. ఇది ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. 

ఒకప్పుడు ఈ జిల్లా పేరుతో రాష్ట్రం 
ఒకప్పుడు భారతదేశంలో కచ్ పేరుతో ఒక రాష్ట్రం ఉండేది. ఇది 1950లో ఏర్పాటయ్యింది. 1956 నవంబర్‌ ఒకటిన ముంబై రాష్ట్రంలో విలీనమయ్యింది. మరాఠీ, గుజరాతీ ప్రజలు అప్పట్లో కచ్‌లో నివసించేవారు. మార్వాడీలు కూడా అధిక సంఖ్యలో ఉండేవారు. 1960లో ముంబై రాష్ట్రాన్ని భాష ఆధారంగా విభజించారు. దీంతో రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అవి మహారాష్ట్ర, గుజరాత్. ఈ నేపథ్యంలో కచ్ జిల్లా గుజరాత్‌లో చేరింది. 2001 జనవరి 26న కచ్‌లో సంభవించిన భూకంపం ఆ జిల్లాను అతలాకుతలం చేసింది. 
ఇది కూడా చదవండి:  ‘హిప్పీలు’ ఇస్కాన్‌ అనుచరులుగా ఎలా మారారు?

Advertisement

What’s your opinion

Advertisement