Sakshi News home page

చెవులకు చిల్లులు పడేలా భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు?

Published Fri, Jun 2 2023 4:58 PM

Loud Underground Sounds Trouble Kerala Village - Sakshi

కొట్టాయం: భూగర్భం నుంచి ఏవో వింత శబ్దాలు.. ఏమై ఉండొచ్చు? వారం రోజుల వ్యవధిలోనే కేరళలో పలు గ్రామాల్లో భూగర్భం నుంచి గంభీరమైన వింత శబ్దాలు రావడం స్థానిక ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా కొట్టాయం జిల్లాలోని చెనప్పాడి గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున భూమిలో నుంచి ఏవో వింత శబ్దాలు వచ్చాయి. ఆ గంభీరమైన శబ్దాలను విని గ్రామ ప్రజలు భయాందోళలకు గురయ్యారు.

శుక్రవారం తెల్లవారుజామున గ్రామంలోని ప్రజలందరూ గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఏవో గంభీరమైన శబ్దాలు భూగర్భం నుంచి వినిపించాయి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ గ్రామప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. శబ్ధాలు గట్టిగా ఉన్నాయని స్థానికులు అన్నారు. బయట వాతావరణంలో ఎలాంటి మార్పులేవీ కనిపింలేదని చెప్పారు. రెండు సార్లు భీకరంగా శబ్దాలు వచ్చాయని పేర్కొన్నారు.

ఆ గ్రామాన్ని పరిశీలిస్తామని కేరళ మైనింగ్, జియాలజీ శాఖ అధికారులు చెప్పారు. గత వారం ఆ జిల్లాలో వినిపించిన శబ్దాలను ఇప్పటికే పరిశీలించామని చెప్పారు. అయినప్పటికీ మళ్లీ ఓ సారి అధికారులను పంపిస్తామని వెల్లడించారు. సెంటర్ ఫర్ ఎర్త్ సైన్సెస్ శాస్త్రీయ అధ్యయనం మాత్రమే ఈ శబ్దాలకు గల కారణాన్ని శాస్త్రీయంగా తెలపగలదని చెప్పారు.

చదవండి:'ముస్లీం లీగ్ లౌకిక పార్టీ' రాహుల్ వ్యాఖ్యలపై.. బీజేపీ ఫైర్‌..

Advertisement

What’s your opinion

Advertisement