జేడీ(యూ)కి ఓటేసినందుకు చితకబాదారు | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 7 2020 1:37 PM

Man Thrashed by RJD Supporters Because He Voted for JDU - Sakshi

పట్నా: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరదశ పోలింగ్‌ నేడు జరుగుతుంది. 19 జిల్లాల్లోని 78 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్‌ జరుగుతుంది. జేడీయూకి ఓటు వేసినందుకుగాను ఆర్జేడీ కార్యకర్తలు ఓ మధ్యవయసు వ్యక్తిని చితకబాదారు. ఈ క్రమంలో బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాల్వియా ఓ వీడియోను షేర్‌ చేశారు. దీనిలో ఓ వ్యక్తి జేడీయూకు ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు తనపై దాడి చేశారని చెప్పడం చూడవచ్చు. ఈ సంఘటన మాధేపూరలో చోటు చేసుకుంది. వీడియోలోని పెద్దాయన తాను బాణం గుర్తుకు ఓటు వేశానని చెప్పడంతో ఆర్జేడీ కార్యకర్తలు తనని చితకబాదారని తెలిపాడు. ‘ఆర్జేడీ అంటే బిహార్‌లో గూండారాజ్యం అని అర్థం’ అంటూ వీడియోని ట్వీట్‌ చేశారు అమిత్‌ మాల్వియా. ప్రస్తుతం ఇది వైరలవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఆర్జేడీ ఎన్నికల ప్రచారం సమయంలో బీజేపీ ఓటర్లకు డబ్బు పంచుతున్న వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘బిహార్‌లో ఓడిపోతానని బీజేపీకి అర్థమయ్యింది. అందుకే డబ్బులు పంచుతుంది. కానీ ఇది బిహార్ సార్‌‌. మీరు డబ్బుతో బిహారీలను కొనలేరు’ అంటూ వీడియోని ట్వీట్‌ చేసింది. (చదవండి: ‘నితీష్‌కు ముందే ఆ విషయం అర్థమైంది)

ఇక బిహార్‌లో నేడు చివరి దశ పోలింగ్‌ కొనసాగుతుంది. దాదాపు 2.35 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజలు రికార్డు స్థాయిలో ఓటు వేయాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నవంబర్‌ 10న ఫలితాలు వెల్లడవుతాయి. ఇక కరోనా వ్యాప్తి తర్వాత దేశంలో మొదటి సారి జరుగుతున్న ఎన్నికలు కావడంతో అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement