మణిపూర్ హింస ఎఫెక్ట్‌.. సీఎం బీరేన్‌ సింగ్‌ రాజీనామా?

30 Jun, 2023 13:50 IST|Sakshi

ఇంపాల్‌: కొద్ది రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మణిపూర్‌లో వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాడపడ్డారు. ఈ నేపథ్యంలో మణిపూర్‌ ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మణిపూర్‌లో శాంతిభ‌ద్ర‌త‌ల వైఫ‌ల్యానికి బాధ్య‌త వ‌హిస్తూ సీఎం బీరేన్‌ సింగ్  తన ప‌ద‌వికి మ‌రికాసేప‌ట్లో రాజీనామా చేయనున్నట్టు తెలుస్తోంది. 

వివరాల ప్రకారం.. మణిపూర్‌లో హింస నేపథ్యంలో సీఎం బీరేన్‌ సింగ్‌ తన పదవికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం మ‌ణిపూర్ గ‌వ‌ర్న‌ర్ అన‌సూయ యుకీకి రాజీనామా పత్రాన్ని స‌మ‌ర్పించే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మ‌ణిపూర్ అల్ల‌ర్ల నేప‌ధ్యంలో రాష్ట్రంలో నెల‌కొన్న ప‌రిస్ధితుల‌ను వివ‌రించేందుకు ఈనెల 23న కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మణిపూర్‌లో పరిస్థితిని అమిత్‌ షాకు ఆయన వివరించారు. ఈ క్రమంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్టు మణిపూర్‌లో హింస కొనసాగుతూనే ఉంది. దీంతో, ఆయన రాజీనామా నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

ఇది కూడా చదవండి: మణిపూర్‌లో అర్ధరాత్రి ఉద్రిక్తత.. సీఎం ఇంటివైపు శవయాత్ర యత్నం.

మరిన్ని వార్తలు