‘మణిపూర్‌’పై పార్లమెంట్‌లో అలజడి | Sakshi
Sakshi News home page

‘మణిపూర్‌’పై పార్లమెంట్‌లో అలజడి

Published Thu, Aug 10 2023 4:17 AM

Manipur violence: Opposition parties protest in Parliament, demand PM Modi statement in both houses - Sakshi

న్యూఢిల్లీ: మణిపూర్‌ అంశంపై ప్రధానమంత్రి మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన కొనసాగించాయి. లోక్‌సభ బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. వెంటనే విపక్ష ఎంపీలు తమ స్థానాల్లో నిల్చొని మణిపూర్‌ అంశంపై నినాదాలు ప్రారంభించారు. ప్రధాని  సభకు రావాలని డిమాండ్‌ చేశారు. ఇంతలో స్పీకర్‌  ‘క్విట్‌ ఇండియా’ ఉద్యమకారులకు సభలో నివాళులరి్పంచారు. 1942 ఆగస్టు 9న జరిగిన ఈ పోరాటంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.

ఆ త్యాగమూర్తులను ప్రజలంతా స్మరించుకోవాలని అన్నారు. అనంతరం విపక్ష ఎంపీలు మళ్లీ నినాదాలు ప్రారంభించారు. వెల్‌లోకి దూసుకొచ్చారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్‌ పలుమార్లు కోరినా వారు లెక్కచేయలేదు. విపక్ష ఎంపీల ఆందోళన మధ్యే స్పీకర్‌ 45 నిమిషాలపాటు ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. సభలో గందరగోళం ఆగకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటల దాకా వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత అవిశ్వాస తీర్మానంపై చర్చ మొదలైంది.  

రాజ్యసభలో రెండు బిల్లులకు ఆమోదం  
మణిపూర్‌ హింసాకాండ వ్యవహారం రాజ్యసభలోనూ అలజడి సృష్టించింది. 267 నిబంధన కింద వెంటనే చర్చ చేపట్టాలని విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల కారణంగా సభను తొలుత మధ్యాహ్నం 2 గంటల వరకు, తర్వాత 2.45 గంటల దాకా, అనంతరం 3.15 గంటల దాకా వాయిదా వేయాల్సి వచి్చంది. బుధవారం సభలో రాజ్యాంగం(òÙడ్యూల్డ్‌ కులాలు) ఆర్డర్‌(సవరణ) బిల్లు–2023పై చర్చ జరిగింది. బిల్లును సభలో ఆమోదించారు.

దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధనల కోసం నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన  ‘అనుసంధాన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లు–2023’ని సైతం రాజ్యసభలో ఆమోదించారు. ఈ బిల్లు వర్సిటీల్లో సానుకూల మార్పు తీసుకొస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు వి.విజయసాయిరెడ్డి, ఆళ్ల ఆయోధ్యరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే క్విట్‌ ఇండియా ఉద్యమంలో అసువులు బాసినవారికి రాజ్యసభలో నివాళులరి్పంచారు. వారి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు.

Business Corporate

Advertisement
Advertisement