ప్రధాని మోదీ మెచ్చిన వీడియో

29 Jul, 2021 08:56 IST|Sakshi
వీడియో దృశ్యం

గాంధీనగర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలుసు. తరుచూ ఏదో ఒక విషయంపై ఆయన స్పందిస్తూనే ఉంటారు. తాజాగా గుజరాత్‌ ఇన్‌ఫర్మేషన్‌ అనే ట్విటట్‌ ఖాతాలో షేర్‌ అయిన వీడియోపై ఆయన స్పందించారు. ఆ వీడియోపై ‘‘ అద్భుతం’’ అని కామెంట్‌ కూడా చేశారు. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. గుజరాత్‌, భావ్‌నగర్‌ జిల్లాలోని కృష్ణజింకల నేషనల్‌ పార్కులో దాదాపు 3 వేల కృష్ణజింకలు ఒకేసారి రోడ్డు దాటుతున్నాయి.

గుంపులు, గుంపులుగా అంత పెద్ద సంఖ్యలో చెంగు చెంగున ఎగురుతూ అవి రోడ్డు దాటటం నిజంగానే అద్భుతంగా ఉంది. ప్రధాని మోదీ ఈ వీడియోపై స్పందించటంతో అది​కాస్తా సోషల్‌మీడియాలో వైరలైంది. దీనిపై నెటిజన్లు.. ‘‘దీన్ని చూడగానే బాగా సంతోషించేది సల్మాన్‌ ఖాన్‌’’.. ‘‘నిజానికి అవి నల్లగా లేవు. కానీ, వాటిని ఎందుకు బ్లాక్‌ బక్స్‌ అని అంటారు’’.. ‘‘ఆ అడవిలో రిపబ్లిక్‌ డే పరేడ్‌ జరుగుతోంది’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు