New Committee Formed To Oversee Cheetah Project After 6 Dead - Sakshi
Sakshi News home page

నాలుగింట్లో.. మూడు కూనలు మృతి.. ఆరుకు చేరిన మరణాల సంఖ్య

Published Fri, May 26 2023 6:23 PM

Ne Committee Formed T Oversee Cheetah Project After 6 Dead - Sakshi

భోపాల్‌: భారత్‌లో అంతరించిపోయిన చీతాల సంతతిని పెంచేందుకు నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి చీతాలను తీసుకొచ్చిన కార్యక్రమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ వనంలో చీతాలు వరసబెట్టి మృత్యుబాట పడుతున్నాయి. ఇప్పటి వరకు విదేశాల నుంచి భారత్‌కు చీతాల తరలింపు ప్రాజెక్ట్‌ చేపట్టిననాటి నుంచి  మూడు చీతాలు, మూడు చీతా కూనలు ప్రాణాలు కోల్పోయాయి. కేవలం రెండున్నర నెలల వ్యవధిలోనే మొత్తం  మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది.

చీతాల మరణాలు ఆందోళకరంగా మారడంతో.. ప్రాజెక్ట్ చీతా అమలును పర్యవేక్షించేందుకు జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కూడిన కొత్త స్టీరింగ్ కమిటీని కేంద్రం నియమించింది.  11 మంది సభ్యులతో కూడిన చిరుత ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసింది. దీనికి గ్లోబల్ టైగర్ ఫోరమ్ సెక్రటరీ జనరల్ రాజేష్ గోపాల్ చైర్మన్‌గా ఉన్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శితో సమావేశం అనంతరం దీనిని ఏర్పాటు చేశారు. 
చదవండి: తప్పిపోయిన 'ఆశ'.. ప్రాజెక్టు చీతా బృందంపై గ్రామస్థుల దాడి

కొత్తగా ఏర్పడిన కమిటీ మధ్యప్రదేశ్‌ల్‌లో ప్రవేశ పెట్టిన చీతాల పురోగతిని అంచనా వేసి పర్యవేక్షిస్తుంది. వాటి మనుగడపై ఎన్టీసీఏకు పలు సూచనలు అందించనుంది. అలాగే ఎకో టూరిజం కోసం చిరుత ఆవాసాలను తెరవడంపై కూడా నిర్ణయం తీసుకోనుంది. సంబంధిత నిబంధనలను సిఫారసు చేయనుంది. ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగనుంది.  ప్రస్తుతం  కునో నేషనల్ పార్క్ ప్రస్తుతం 18 చిరులు, ఒక కూన చిత ఉంది.

కాగా నమీబియా నుంచి తీసుకొచ్చేటపుడే మూత్రపిండ సంబంధ వ్యాధితో బాధపడుతున్న సాశా అనే చీతా మార్చి 27న చనిపోయింది. తర్వాత దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఉదయ్‌ అనే చీతా ఏప్రిల్‌ 13న మరణించింది. దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన దక్ష అనే మరో చీతా కలయిక కోసం మరో మగ చీతాతో జరిగిన పోరాటంలో తీవ్ర గాయాలపాలై ఈనెల తొమ్మిదో తేదీన తుదిశ్వాస విడిచింది.  

డీహైడ్రేషన్‌..
గత ఏడాది సెప్టెంబర్‌లో నమీబియా నుంచి తీసుకొచ్చిన సియాయా అనే ఆడ చీతాకు జ్వాల అని నామకరణం చేసి కూనో నేషనల్‌ పార్క్‌లో వదిలిపెట్టారు. అది మార్చి నెలలో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. కాగా సూర్యప్రతాపం కారణంగా కూనో వనంలో పగటిపూట వేడి దాదాపు 47 డిగ్రీల సెల్సియస్‌గా ఉండటంతో డీహైడ్రేషన్‌ కారణంగా మే 23న తొలి కూన మృత్యువాత పడింది. దీంతో వాటిని వేరే చోటుకు తరలించాలని అధికారులు భావించారు. ఆలోపే గురువారం మరో రెండు కూనలు మరణించాయి. వాస్తవానికి ఆ రెండింటినీ ప్రత్యేక సంరక్షణలో ఉంచామని అయినా కాపాడలేకపోయామని, నాలుగో కూనను అత్యంత జాగ్రత్తగా చూసుకుంటున్నామని పర్యవేక్షక బృందం గురువారం ప్రకటించింది.

Advertisement
Advertisement