నగల వ్యాపారి హనీట్రాప్‌లో కొత్త ట్విస్ట్‌

9 Sep, 2022 07:59 IST|Sakshi

వైరల్‌గా మారిన ఆడియో, వీడియో

హనీట్రాప్‌ ఓ నాటకమా ? 

మండ్య: మండ్యకు చెందిన బంగారం వ్యాపారి హనీట్రాప్‌ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. గతనెల ఓ లాడ్జీలో యువతితో ఉన్న జగన్నాథశెట్టిని ఇద్దరు యువకులు, ఓ మహిళ లాడ్జికి వచ్చి బెదిరించారు. ఆ సమయంలో జగన్నాథ శెట్టి తాను ఓ కళాశాల ప్రిన్సిపల్‌ అని చెప్పుకుని ట్యూషన్‌ కోసం యవతిని పిలుచుకుని వచ్చానని వారికి చెప్పాడు. ఆయన మాటలను వారు విశ్వసించకపోవడంతో పాటు తీవ్రంగా కొట్టారు. కొట్టొద్దని వేడుకున్నా వదలలేదు. తాజాగా ఈ వీడియో మొత్తం ఇప్పుడు వైరల్‌గా మారింది.
 
వైరల్‌గా జగన్నాథశెట్టి ఆడియో..  
మైసూరులో ఓ లాడ్జిలో రెండు రోజులు ఉందామని జగన్నాథశెట్టి ఓ యువతికి ఫోన్‌ చేశాడు. సదరు యువతి పుస్తకాలు ఏమైనా తీసుకురావాలా అన్ని ప్రశ్నిస్తే నీకు ఏ పుస్తకం కావాలో నేనే తీసుకువస్తానని ఆ ఆడియో పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే జగన్నాథ శెట్టి మండ్య బస్టాండ్‌లో మంగళూరు వెళ్లడానికి వేచి ఉండగా ముగ్గురు వ్యక్తులు మైసూరుకు డ్రాప్‌ ఇస్తామని చెప్పి ఓ వాహనంలో ఎక్కించుకుని ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి యువతిని గదిలోకి పంపించి హనీట్రాప్‌నకు పాల్పడ్డారని, ఆ ముఠా డబ్బులు డిమాండ్‌ చేశారని జగన్నాథశెట్టి అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

చదవండి: (నగల వ్యాపారికి హనీ ట్రాప్‌.. వద్దన్నా హోటల్‌కు.. యువతి ఎంట్రీ..)

అయితే తాజాగా జగన్నాథశెట్టి సదరు యువతితో మాట్లాడిన ఆడియో, ఆయనపై ముఠా దాడిచేసే వీడియో ఇప్పుడు బయటకు రావడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. నిజంగా హనీట్రాప్‌ జరిగిందా లేదా, ఇది సల్మా ఆమె గ్యాంగ్‌ డబ్బులు వసూలు చేసుకుని ఈ వీడియో వైరల్‌ చేశారా అనేది ఇప్పుడు చర్చనీయంశమైంది. దీంతో పోలీసులు అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేపట్టారు.  

మరిన్ని వార్తలు