‘నివర్‌’ ముప్పు : కుష్బూ, ప్రకాశ్‌ రాజ్‌ స్పందన

25 Nov, 2020 20:57 IST|Sakshi

దయచేసి బయటకురాకండి : కుష్బూ భావోద్వేగం

సహాయ కార్యక్రమాల్లో ప్రకాశ్‌ రాజ్‌

సాక్షి, చెన్నై:  తీవ్ర తుపానుగా ముంచుకొస్తున్న ‘నివర్‌’పై నటి,ఇటీవల బీజేపీలో చేరిన కుష్పూ స్పందించారు. రానున్న విపత్కర పరిస్థితి నేపథ్యంలో ప్రజలంతా  అప్రమత్తంగా ఉండాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె  ట్వీటర్‌లో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఇప్పటికే కరోనా భయపెడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తుపానుదూసుకు వస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రతిసంవత్సరం తమిళనాడును తుపాను ముంచెత్తి భారీ నష్టాన్ని మిగులుస్తోంది.ఎవ్వరు కూడా బయటకు వెళ్లకుండా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పుడు నివర్ తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే బలమైన గాలులు వీస్తున్నాయి. వర్షాలు పడుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. రోడ్లన్నీ మూసుకుపోయాయని ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దయచేసి చెన్నై, పాండిచ్చేరి తదితర ప్రాంతంలో ప్రజలకోసం అందరం ప్రార్ధిద్దాం అని కుష్పూ  భావోద్వేగానికి  లోనయ్యారు.

మరోవైపు నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తుపాను బాధితుల సహాయ కార్యక్రమాల్లో మునిగిపోయారు. స్థానిక యువకుల సాయంతో, ప్రకాశ్‌ రాజ్‌ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో  బాధితులను ఆదుకునేందుకు రంగంలోకి దిగారు.  కోవలం ప్రాంతంలో సుందర్ నేతృత్వంలోని  స్కోప్‌ఎంటర్‌ప్రైజ్ ద్వారా కార్యక్రమాన్ని చేపట్టామంటూ ట్వీట్‌ చేశారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. కాగా 2020 ఏడాదిలో ప్రజలం కరోనా మహమ్మారితో అతలాకుతలమయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఆర్థికంగా తీవ్ర సంక్షోభం పట్టి పీడిస్తోంది. దీనికి తోడు ప్రకృతి ప్రకోపంతో మరో ముప్పు పొంచివుంది. తీవ్రమైన తుపానుగా మారిన ‘నివర్’ తమిళనాడు వైపుకు దూసుకు వస్తోందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రజలంతా బెంబేలెత్తిపోతున్నారు. అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యల్ని మొదలు పెట్టింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు. సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు