Sakshi News home page

Heat Stroke: దంచికొడుతున్న ఎండలకు మాడిపోతున్న గబ్బిలాలు.. చలించిపోయిన గ్రామస్తులు

Published Tue, Apr 18 2023 12:08 PM

Odisha Bats Die Of Heat Stroke Villagers Water Spray For Remaining - Sakshi

భువనేశ్వర్‌: దంచికొడుతున్న ఎండలకు మనుషులే తట్టుకోలేకపోతున్నారు. ఇక పక్షులు, జంతువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కబటబంధా గ్రామంలో గబ్బిలాలు ఎండ వేడికి విలవిల్లాడిపోతున్నాయి. హీట్‌ స్ట్రోక్‌ కారణంగా మృత్యువాత పడుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో మూడు రోజుల్లోనే 8 గబ్బిలాలు మరణించాయి.

ఈ గ్రామం సమీపంలో దాదాపు 5వేలకు పైగా గబ్బిలాలు మూడు చెట్లపై నివసిస్తున్నాయి. రోజంతా వీటి చప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. అయితే ఎండదెబ్బకు వందల కొద్ది గబ్బిలాలు నేలపై పడిపోతున్నాయి. గ్రామస్థులు వీటిని చూసి చలించిపోతున్నారు. వాటికి ఉపశమనం కల్పించేందుకు వాటర్‌ స్ప్రే కొడుతున్నారు.

గబ్బిలాలు పవిత్రమైనమని తాము భావిస్తామని, అందుకే వాటిని 20 ఏళ్లుగా కాపాడుకుంటున్నామని కేశవ్ చంద్ర సాహు అనే స్థానికుడు తెలిపాడు. ఎండ వేడికి తట్టుకోలేక గబ్బిలాలు కిందపడి చనిపోవడం చూస్తుంటే బాధగా ఉందన్నాడు.

కాగా.. ఒడిశాలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అధికారులు సూచిస్తున్నారు.  మరోవైపు రానున్న ఐదు రోజుల్లో ఒడిశాలోని పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
చదవండి: దేశవ్యాప్తంగా ఠారెత్తిస్తున్న ఎండలు

Advertisement

తప్పక చదవండి

Advertisement