Sakshi News home page

పార్లమెంట్‌ సమావేశాలకు తెర

Published Sat, Dec 24 2022 5:43 AM

Parliament Winter Session Ends Early Amid Demands For Discussion On India-China Clash - Sakshi

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు షె డ్యూల్‌ కంటే ఆరు రోజుల ముందే శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. ఈ నెల 7న సమావేశాలు ప్రారంభమయ్యాయి. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29న ముగియాల్సి ఉంది. సరిహద్దులో భారత్‌–చైనా ఘర్షణపై పార్లమెంట్‌ చర్చించాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు ఉభయ సభలను కొద్దిరోజులుగా స్తంభింపజేస్తున్నాయి. దీంతో సభలను తరచూ వాయిదా వేయాల్సి వస్తోంది.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం శీతాకాల సమావేశాలను షెడ్యూల్‌ కంటే ముందే ముగించినట్లు తెలుస్తోంది. క్రిస్మస్, న్యూ ఇయర్‌ దృష్ట్యా ఇందుకు అన్ని             పార్టీల సభాపక్ష నేతలు అంగీకరించారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. శుక్రవారం చివరి రోజు పార్లమెంట్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, కాంగ్రెస్‌ ఎంపీలు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ తదితరులు హాజరయ్యారు.

వరుసగా ఎనిమిదోసారి..  
పార్లమెంట్‌ సమావేశాలు షెడ్యూల్‌ కంటే ముందే ముగియడం ఇది వరుసగా ఎనిమిదోసారి! 17వ లోక్‌సభలో అత్యంత తక్కువ కాలం జరిగిన భేటీల్లో ఇది కూడా ఒకటని సమాచారం.

Advertisement

What’s your opinion

Advertisement