ప్రయాణికురాలి పిల్లి పరారు.. ఎయిర్‌పోర్టులో కేసు!

27 Nov, 2022 10:29 IST|Sakshi

దొడ్డబళ్లాపురం: ఓ ప్రయాణికురాలి పెంపుడు పిల్లి పారిపోయిన సంఘటన కెంపేగౌడ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. కెల్లి జాన్సన్‌ అనే మహిళ గత బుధవారం తెల్లవారుజామున ఇక్కడి నుంచి దోహాకు వెళ్తూ తన పెంపుడు కుక్కను, పిల్లిని ప్రత్యేక పంజరాల్లో ఉంచి తెచ్చారు.

వాటిని తనతో పాటు పంపాలని ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బందికి అప్పగించారు. చెకింగ్‌ పూర్తయిన తరువాత పంజరం నుంచి పిల్లి కనబడకుండా పోయింది. ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న తన పిల్లిని తెచ్చివ్వాల్సిందేనని మహిళ అక్కడి భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు. 

చదవండి: సేల్స్‌ బీభత్సం, ఆ కంపెనీకి ఒక సెక​ను లాభం రూ. 1.48 లక్షలు!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు